FD Rates | మీరు బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావిస్తున్నారా? అయితే శుభవార్త. బ్యాంకులు తన డిపాజిట్లను పెంచుకోవడం కోసం వడ్డీ రేట్లను మరింత పెంచొచ్చని దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ – RBI) పేర్కొంటోంది. 2022 మే నెల నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచేసింది. దీంతో బ్యాంకులు (Banks) కూడా వడ్డీ రేట్ల పెంపు పోటీలో పరుగులు పెడుతున్నాయని ఆర్‌బీఐ వెల్లడించింది. ఆర్‌బీఐ తాజాగా విడుదల చేసిన మంత్లీ బులెటిన్‌లో ఈ విషయాలను వెల్లడించింది.
సెంట్రల్ బ్యాంక్ బులెటిన్ ప్రకారం.. టర్మ్ డిపాజిట్లపై రాబడి మెరుగుపడింది. సేవింగ్స్ డిపాజిట్ రేట్లు కూడా పెరిగాయి. ఎక్కువ శాతం బ్యాంక్ డిపాజిట్లు టర్మ్ డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. వార్షికంగా చూస్తే.. టర్మ్ డిపాజిట్లు 13.2 శాతం మేర పెరిగాయి. కరెంట్ అండ్ సేవింగ్స్ డిపాజిట్లు వరుసగా 4.6 శాతం, 7.3 శాతం చొప్పున పైకి కదిలాయి.
రూ.300 పొదుపుతో రూ.50 లక్షలు పొందండి.. ఎల్ఐసీ అద్భుతమైన పాలసీ!
ఆర్‌బీఐ వరుసగా ఆరు సార్లు రెపో రేటు పెంచడం ద్వారా బ్యాంకులు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే.. స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీమైన వడ్డీ రేటును అందిస్తున్నాయి. మూడేళ్ల టెన్యూర్‌లోని టర్మ్ డిపాజిట్లపై టాప్ 10 బ్యాంకుల వడ్డీ రేటును గమనిస్తే.. సగటున 7.5 శాతంగా ఉంది.
శుభవార్త.. ఆధార్, ఓటర్ కార్డు లింక్ గడువు పొడిగింపు.. కొత్త డెడ్‌లైన్ ఇదే!
అమెరికాలో బ్యాంకుల సంక్షోభం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పరిమితంగానే ఉండొచ్చని ఆర్‌బీఐ పేర్కొంటోంది. వ్యవసాయ రంగం సానుకూలముగా ఉందని, పరిశ్రమలు కూడా మళ్లీ గాడిలో పడుతున్నాయని, సర్వీస్ రంగం అదరగొడుతోందని వివరించింది. అయితే ద్రవ్యోల్బణం ఇంకా అధిక స్థాయిలోనే ఉండటం ఆందోళ కలిగించే అంశం అని పేర్కొంది.
కాగా అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా అమెరికా కేంద్ర బ్యాంక్ రెపో రేటును పెంచుతుందా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. అయితే ఆర్‌బీఐ మాత్రం వచ్చే పాసలీ సమీక్షలో కూడా మరోసారి రెపో రేటు పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. పావు శాతం మేర రెపో రేటు పెరిగే ఛాన్స్ ఉందని అందరూ అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌లో రెపో రేటు పావు శాతం పెరిగితే అప్పుడు ఈ రేటు 6.75 శాతానికి చేరొచ్చు. అంటే గత ఏడాది మే నెల నుంచి చూస్తే.. వచ్చే పెంపును కూడా పరిగణలోకి తీసుకుంటే.. అప్పుడు రెపో రేటు పెంపు 275 బేసిస్ పాయింట్ల వరకు ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, FD rates, Fixed deposits, Rbi, Reserve Bank of India