భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ విప్లవంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ది (UPI) కీలకపాత్ర. ఒక అకౌంట్ నుంచి మరో అకౌంట్‌కు క్షణాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి యూపీఐ పేమెంట్ పద్ధతి ఉపయోగపడుతోంది. అయితే ప్రస్తుతం డెబిట్ కార్డ్ (Debit Card) ఉన్నవారికే యూపీఐ సేవలు లభిస్తున్నాయి. దేశంలో డిజిటల్ చెల్లింపుల్ని పెంచేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మరో ముందడుగు వేసింది. ఆధార్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని బ్యాంకుల్ని కోరింది. అంటే డెబిట్ కార్డ్ అవసరం లేకుండా ఆధార్ కార్డ్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేయొచ్చు. దీని వల్ల డెబిట్ కార్డ్ లేనివాళ్లు కూడా యూపీఐ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఫలితంగా డిజిటల్ పేమెంట్స్ పెరుగుతాయి.
ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం ఎవరైనా తమ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించి యూపీఐ యాక్టివేట్ చేయాలంటే తప్పనిసరిగా ఏటీఎం కార్డ్ ఉండాలి. తమ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన ఫోన్ నెంబర్, ఏటీఎం కార్డులో చివరి ఆరు అంకెలు ఉంటే చాలు. యూపీఐ యాక్టివేట్ చేయొచ్చు. యూపీఐ పిన్ జనరేట్ చేయాలన్నా, మార్చాలన్నా ఏటీఎం కార్డులో చివరి ఆరు అంకెలు తప్పనిసరి. దీనివల్ల ఏటీఎం కార్డులు లేనివాళ్లు యూపీఏ పేమెంట్స్ చేయలేకపోతున్నారు.
LIC Policy: ఎల్ఐసీ నుంచి మీకు పాలసీ డబ్బులు రావాల్సి ఉందా? ఇలా చెక్ చేయండి
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకొస్తున్న కొత్త విధానం వల్ల డెబిట్ కార్డ్ లేనివాళ్లు, ఏటీఎం కార్డ్ యాక్టీవ్‌గా లేనివాళ్లు కూడా యూపీఐ ప్లాట్ఫామ్లో చేరొచ్చు. యూపీఐ పిన్ మార్చుకోవచ్చు. ఇందుకోసం ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఆధార్ కార్డ్ ఓటీపీ ద్వారా యూపీఐ యాక్టివేట్ చేయడం సాధ్యమవుతుంది. 2022 మార్చి 15 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇందుకోం NPCI యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాతో (UIDAI) చేతులు కలపనుంది. యూఐడీఏఐ గైడ్‌లైన్స్ ప్రకారం ఆధార్ ఓటీపీ వేలిడేషన్ జరుగుతుంది.
ఈ విధానం తీసుకురావాలని NPCI గతేడాది సెప్టెంబర్‌లోనే సర్క్యులర్ జారీ చేసింది. 2021 డిసెంబర్ 15 లోగా ఈ విధానం ప్రారంభించాలని కోరింది. కానీ ఆ తర్వాత ఈ గడువును 2022 మార్చి 15 వరకు పొడిగించింది. ఇక ఆరోజు నుంచి బ్యాంకులు ఆధార్ ఓటీపీ ద్వారా యూపీఐ ప్లాట్ఫామ్లో చేరే అవకాశం కల్పించున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాసెస్ ఎన్పీసీఐ సిస్టమ్స్, బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, థర్డ్ పార్టీ అప్లికేషన్ల దగ్గర ప్రాసెస్‌లో ఉందని, పూర్తి స్థాయిలో ఈ విధానం అమలు కావడానికి 9 నెలల నుంచి 12 నెలల సమయం పట్టొచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం దాదాపు ప్రతీ ఒక్కరి దగ్గర ఆధార్ నెంబర్ ఉండటంతో, ఆధార్ ఓటీపీ ద్వారా యూపీఐ ప్లాట్ఫామ్లో చేరడం సులువవుతుంది.
అయితే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉన్న స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న యూపీఐ అప్లికేషన్లో మాత్రమే ఈ విధానం పనిచేస్తుంది. దీంతో పాటు అదే మొబైల్ నెంబర్ బ్యాంకులో కూడా రిజిస్టర్ అయి ఉండాలి. ఓటీపీ ఆథెంటికేషన్తో పాటు ఆధార్ హోల్డర్ మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేస్తాయి బ్యాంకులు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.