హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank Account: బ్యాంక్ అకౌంట్ కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవసరం లేదు... ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు

Bank Account: బ్యాంక్ అకౌంట్ కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవసరం లేదు... ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు

Bank Account: బ్యాంక్ అకౌంట్ కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవసరం లేదు... ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Bank Account: బ్యాంక్ అకౌంట్ కోసం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవసరం లేదు... ఈ ఒక్క నెంబర్ ఉంటే చాలు (ప్రతీకాత్మక చిత్రం)

Bank Account | బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి త్వరలో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ (Aadhaar Card) లాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. కేవలం సీకేవైసీ నెంబర్ ఉంటే చాలు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పాన్ కార్డ్ (PAN Card), ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ (Driving Licence) లాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు. బ్యాంక్ అకౌంట్ (Bank Account) మాత్రమే కాదు మ్యూచువల్ ఫండ్స్ కొనడానికి, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, బాండ్స్ కొనడానికి, ఇన్స్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి కూడా నో యువర్ కస్టమర్ (KYC) డాక్యుమెంట్స్ సమర్పించాల్సిన అవసరం లేదు. ఇందుకోసం సెంట్రల్ కేవైసీ (CKYC) సిస్టమ్‌ను ఉపయోగించుకోనున్నాయి బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు. అందులో ఉన్న కస్టమర్ కేవైసీ వివరాలు సేకరించి అకౌంట్ ఓపెన్ ప్రాసెస్ పూర్తి చేయనున్నాయి.

ప్రస్తుతం ఏ ఫైనాన్షియల్ సర్వీస్ పొందాలన్నా కేవైసీ తప్పనిసరి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం దగ్గర్నుంచి బ్యాంకులో లాకర్ తీసుకునే వరకు ప్రతీచోటా కేవైసీ అవసరం అవుతోంది. కస్టమర్లు పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్ లాంటి కేవైసీ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సిందే. ఫైనాన్షియల్ సంస్థలు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, వోటర్ ఐడీ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి కేవైసీ డాక్యుమెంట్స్ అనుమతిస్తారు. ఈ కేవైసీ డాక్యుమెంట్స్ ఒరిజినల్ కాపీస్ సమర్పించడంతో పాటు ఇన్ పర్సన్ వెరిఫికేషన్ (IPV) కూడా తప్పనిసరి. ఫైనాన్షియల్ సంస్థల్లో ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. లేదా వారి సిబ్బంది వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తారు.

SBI Account: వీడియో కేవైసీతో ఎస్‌బీఐ అకౌంట్... మీ ఇంటి నుంచే ఓపెన్ చేయండిలా

కేవైసీ కింద పలు రకాల డాక్యుమెంట్స్ అనుమతిస్తారు కాబట్టి వేర్వేరు సంస్థల నుంచి పలు రకాల ఆర్థిక సేవల్ని పొందడం సులువు అవుతోంది. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్నేళ్ల క్రితమే సెంట్రల్ కేవైసీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. సెబీ, ఐఆర్‌డీఏఐ, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు సీకేవైసీ ఉపయోగించుకొని కస్టమర్లకు సేవల్ని అందించవచ్చు.

Pension Scheme: ఇప్పటి నుంచి పొదుపు చేయండి... నెలకు రూ.50,000 పెన్షన్ పొందండి ఇలా

సీకేవైసీ వ్యవస్థ పూర్తిగా అమలులోకి వస్తే సీకేవైసీ ఉన్న కస్టమర్లు ఎవరైనా తమ కేవైసీ డాక్యుమెంట్స్ సమర్పించకుండానే దేశంలో ఎక్కడైనా ఆర్థిక సేవలు పొందొచ్చు. ఇందుకోసం సీకేవైసీ నెంబర్ ఒకటే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వ్యక్తికి ఇప్పటికే అదే బ్యాంకులో లేదా ఇతర బ్యాంకుల్లో అకౌంట్లు ఉంటే ఆ వివరాలను సీకేవైసీ ద్వారా తెలుసుకోవడం సులువు. ఇతర బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ల వివరాలను ఏ బ్యాంక్ అయినా సులువుగా తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఒకే వ్యక్తి రెండు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ లేదా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేసినా సులువుగా తెలుస్తుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Aadhaar Card, Bank account, PAN card, Personal Finance

ఉత్తమ కథలు