హోమ్ /వార్తలు /బిజినెస్ /

SBI Account: వీడియో కేవైసీతో ఎస్‌బీఐ అకౌంట్... మీ ఇంటి నుంచే ఓపెన్ చేయండిలా

SBI Account: వీడియో కేవైసీతో ఎస్‌బీఐ అకౌంట్... మీ ఇంటి నుంచే ఓపెన్ చేయండిలా

SBI Account: వీడియో కేవైసీతో ఎస్‌బీఐ అకౌంట్... మీ ఇంటి నుంచే ఓపెన్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

SBI Account: వీడియో కేవైసీతో ఎస్‌బీఐ అకౌంట్... మీ ఇంటి నుంచే ఓపెన్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

SBI Account | ఎస్‌బీఐ అకౌంట్ ఓపెన్ చేయాలనుకునేవారికి గుడ్ న్యూస్. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే మీ స్మార్ట్‌ఫోన్‌లో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ (Digital Savings Account) ఓపెన్ చేయొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? ఎస్‌బీఐ అకౌంట్ (SBI Account) తెరవడానికి బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూర్చొనే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఎస్‌బీఐ వీడియో కేవైసీ ఫీచర్‌తో సింపుల్‌గా బ్యాంక్ అకౌంట్ తెరవొచ్చు. ఒకప్పుడు అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ చాలా పెద్దగా ఉండేది. ముందుగా బ్యాంకులో అప్లికేషన్ ఫామ్ ఇచ్చి, బ్యాంకులో అప్పటికే అకౌంట్ ఉన్నవారి రికమెండేషన్ లెటర్ ఇచ్చిన తర్వాత, బ్యాంకు సిబ్బంది వెరిఫికేషన్ చేసి అకౌంట్ ఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చేవారు. ఈ ప్రాసెస్ మొత్తం ఓ వారం రోజులు పట్టేది.
ఇప్పుడు గంటలో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అది కూడా ఇంటి నుంచే. టెక్నాలజీ సాయంతో ఇదంతా సాధ్యం అవుతోంది. ఎస్‌బీఐలో డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ కూడా ఇంతే సింపుల్‌గా ఓపెన్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని స్మార్ట్‌ఫోన్‌లో ఎస్‌బీఐ అకౌంట్ తెరవొచ్చు. ఇందుకోసం వీడియో కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. మరి ఎస్‌బీఐ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకోండి.
Pension Scheme: ఇప్పటి నుంచి పొదుపు చేయండి... నెలకు రూ.50,000 పెన్షన్ పొందండి ఇలాఎస్‌బీఐ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయండిలా


Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో యోనో ఎస్‌బీఐ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.
Step 2- ఆ తర్వాత New to SBI పైన క్లిక్ చేయండి.
Step 3- ఆ తర్వాత Insta Plus Savings Account సెలెక్ట్ చేయండి.
Step 4- కస్టమర్లు తమ ఆధార్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5- ఆ తర్వాత ఆధార్ ఆథెంటికేషన్ పూర్తి చేయాలి.
Step 6- మీ వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయాలి.
Step 7- కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసేందుకు వీడియో కాల్ షెడ్యూల్ చేయాలి.
Step 8- ఎస్‌బీఐ సిబ్బంది వీడియో కేవైసీ ప్రాసెస్ పూర్తి చేస్తారు.
Step 9- ఆ తర్వాత ఆటోమెటిక్‌గా డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ అవుతుంది.
New Rules in September: సెప్టెంబర్‌లో అమలులోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే
వీడియో కేవైసీ ద్వారా ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కస్టమర్లు బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. కేవలం ఆధార్ వివరాలు, పాన్ కార్డ్ వివరాలు చాలు. పాన్ కార్డ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉండాలి. డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత నెఫ్ట్, ఐఎంపీఎస్, యూపీఐ లాంటి సేవల్ని వాడుకోవచ్చు.


ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్ అకౌంట్ ఓపెన్ చేసినవారికి రూపే క్లాసిక్ కార్డ్ ఇస్తుంది బ్యాంకు . యోనో యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌లో 24 గంటల పాటు బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఎస్‌బీఐ క్విక్ మిస్డ్ కాల్ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. నామినేషన్ తప్పనిసరి. కస్టమర్ కోరుకుంటే బ్యాంకు పాస్‌బుక్ జారీ చేస్తుంది. రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌కు వర్తించిన సర్వీస్ ఛార్జీలే ఎస్‌బీఐ ఇన్‌స్టా ప్లస్ అకౌంట్‌కు వర్తిస్తాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Bank account, Personal Finance, Sbi, State bank of india

ఉత్తమ కథలు