Good News: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక

House Building Advance Interest Rates | ఈ నిర్ణయం ద్వారా ఇళ్లకు డిమాండ్ పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కల నెరవేరుతుందని భావిస్తోంది కేంద్రం. శాశ్వత ఉద్యోగులతో పాటు, ఐదేళ్లుగా సేవలు అందిస్తున్న తాత్కాలిక ఉద్యోగుల కూడా హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వర్తిస్తుంది.

news18-telugu
Updated: October 4, 2019, 3:42 PM IST
Good News: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక
Good News: ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం దసరా కానుక అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గత నెల వరకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8.5 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ వడ్డీ రేటును 7.9 శాతానికి తగ్గిస్తూ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన జారీ చేసింది. కొత్త వడ్డీ రేట్లు అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేట్లు తగ్గుతాయని గత నెలలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పుడు అధికారక ప్రకటన వచ్చింది. ఈ నిర్ణయం ద్వారా ఇళ్లకు డిమాండ్ పెరగడంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సొంతింటి కల నెరవేరుతుందని భావిస్తోంది కేంద్రం. శాశ్వత ఉద్యోగులతో పాటు, ఐదేళ్లుగా సేవలు అందిస్తున్న తాత్కాలిక ఉద్యోగుల కూడా హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వర్తిస్తుంది.

బ్యాంకుల నుంచి సామాన్యులు తీసుకునే హోమ్ లోన్ లాంటిదే హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్-HBA కూడా. ప్రైవేట్ బిల్డర్లు, సొసైటీలు, హౌజింగ్ బోర్డుల్లాంటి సంస్థల నుంచి కొనే ఇళ్లకు మాత్రమే కాదు, ప్లాట్ కొనడానికి, ఇల్లు నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకోవడానికి అర్హులు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 నెలల బేసిక్ పే గరిష్టంగా రూ.25 లక్షల వరకు లేదా ఇంటికి అయ్యే ఖర్చు లేదా తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి లోన్ అమౌంట్‌ నిర్ణయించబడుతుంది. అప్పటికే ఉన్న ఇంటిని విస్తరించాలనుకుంటే గరిష్టంగా రూ.10 లక్షలు మాత్రమే తీసుకోవచ్చు. వడ్డీ రేట్లను కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. కొత్తగా ప్రకటించిన వడ్డీ రేట్లను మళ్లీ ఏడాది తర్వాత సమీక్షించనుంది.

Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేసేవారికి గుడ్ న్యూస్... ఆర్‌బీఐ కీలక నిర్ణయం

SBI Charges: ఎస్‌బీఐ ఛార్జీల్లో మార్పు... మనీ ట్రాన్స్‌ఫర్, మంత్లీ బ్యాలెన్స్ కొత్త ఛార్జీలు తెలుసుకోండిIRCTC: పండుగకు ఊరెళ్తున్నారా? ఈ టెక్నిక్‌తో రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ
First published: October 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు