Airtel offer: తెలంగాణ, ఏపీలోని ఎయిర్‌టెల్ యూజర్లకు బంపరాఫర్... ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే అదనంగా డేటా

Airtel offer: తెలంగాణ, ఏపీలోని ఎయిర్‌టెల్ యూజర్లకు బంపరాఫర్... ఈ ప్లాన్ రీఛార్జ్ చేస్తే అదనంగా డేటా (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Prepaid Plans | తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త. రోజూ అదనంగా 4జీ డేటా ఇచ్చేలా ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది ఎయిర్‌టెల్. పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రస్తుతం ఎయిర్టెల్ అమలు చేస్తున్న రూ.199 విలువ గల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌‌లో సవరణ చేసింది. ఈ ప్లాన్ కింద ఇదివరకు ప్రతి రోజు కేవలం 1 GB డేటా మాత్రమే లభించేది. ఇక నుంచి 1.5 GB లభించనుంది. ప్రస్తుతం రిలయన్స్ జియో చౌక ధరకే అన్‌లిమిటెడ్ ప్లాన్లు అందిస్తున్న నేపథ్యంలో మిగతా నెట్వర్క్స్ కూడా తమ కస్టమర్లకు అదే రీతిలో ప్లాన్స్ ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే భారతీ ఎయిర్టెల్ కూడా రూ.199 విలువ గల తన అన్‌లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో సవరణ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాన్ కింది వినియోగదారులకు అదనపు డేటాను అందిస్తుంది. ఇంతకుముందు రూ .199 ప్లాన్‌ రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు ప్రతిరోజూ కేవలం 1 GB డేటా మాత్రమే లభించేది. అయితే, ఇప్పుడు ఈ ప్లాన్ను రీఛార్జ్ చేసుకునే వారికి రోజూ 1.5 GB డేటా లభించనుంది. దీనితో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ల ను కూడా పొందవచ్చు. 24 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్ కింద వినియోగదారుకు వింక్ మ్యూజిక్, హెలోట్యూన్‌‌లను యాక్సెస్ కూడా లభిస్తుంది. అలాగే, వినియోగదారులు ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ ఉచిత సేవలను కూడా పొందవచ్చు. రిలయన్స్ జియో కూడా రూ. 199లకే ప్రతి రోజూ 1.5 GB డేటాతో పాటు అన్లిమిటడ్ కాలింగ్ సౌకర్యం కూడా అందిస్తుంది.

Paytm Instant Personal Loan: 2 నిమిషాల్లో రూ.2,00,000 లోన్... పేటీఎం యూజర్లకు మాత్రమే

Jio 28 days plans: జియో ప్లాన్ బెనిఫిట్స్ మారాయి... 28 రోజుల వేలిడిటితో రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో కూడా ఆఫర్ వర్తింపు


అయితే, ఈ రీఛార్జ్ ఆప్షన్ను కొన్ని ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంచింది. ఎంపిక చేసిన నెంబర్లకే పరిమితం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సర్కిళ్లలో మాత్రమే ఈ డేటా ప్లాన్ అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది. కాగా, దేశవ్యాప్తంగా ఉన్న ఇతర టెలికాం సర్కిల్‌కు చెందిన వారికి కూడా రూ .199 ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అయితే, ఇదివరకు ఉన్న విధంగా వారికి ప్రతిరోజూ 1 GB డేటా మాత్రమే లభిస్తుంది. కాగా, ఎయిర్ టెల్ వినియోగదారులు ఇంతకుముందు ప్రతి రోజు 1.5 GB డేటా కావాల్సి వచ్చినప్పుడు రూ.249తో రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ కింద రోజు 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. కాగా, రిలయన్స్ జియో కూడా రూ .249 ప్లాన్ను అమలు చేస్తోంది. ఈ ప్లాన్‌తో ఎయిర్‌టెల్ మాదిరిగా కాకుండా 2 జిబి డేటాను అందిస్తుంది.
Published by:Santhosh Kumar S
First published: