ఆధార్ కార్డ్ (Aadhaar Card) అప్‌డేట్ చేయాలంటే ఏదైనా ఓ ప్రూఫ్ తప్పనిసరి. ఐడెంటిటీ ప్రూఫ్‌గా 27 రకాల డాక్యుమెంట్స్, ప్రూఫ్ ఆఫ్ రిలేషన్‌షిప్ కోసం దరఖాస్తుదారుల పేరు, కుటుంబ యజమాని పేరు ఉన్న 10 డాక్యుమెంట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 13 రకాల డాక్యుమెంట్స్, అడ్రస్ ప్రూఫ్‌గా 28 రకాల డాక్యుమెంట్స్ ఇచ్చే వెసులుబాటు కల్పించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI). మరి ఏ ప్రూఫ్ లేనప్పుడు ఆధార్ ఎలా అప్‌డేట్ చేయాలన్న సందేహం ఆధార్ కార్డ్ హోల్డర్లలో ఉంటుంది. ఇందుకు ఓ వెసులుబాటు ఉంటుంది. హెడ్ ఆఫ్ ఫ్యామిలీ డిక్లరేషన్ ఇచ్చి ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయొచ్చు.
తమ పేరు మీద ప్రూఫ్ లేకపోతే కుటుంబ యజమాని డిక్లరేషన్, వారి ఐడీ ప్రూఫ్ ఇచ్చి ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫామ్ అందుబాటులో ఉంటుంది. అయితే రిలేషన్‌షిప్ డాక్యుమెంట్‌లో ఎవరి పేర్లు ఉంటాయో వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఉదాహరణకు రేషన్ కార్డులో కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి కాబట్టి, కుటుంబ యజమాని డిక్లరేషన్, వారి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి కుటుంబ సభ్యులు తమ ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు.
Bank Account: ఈ బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి అదిరిపోయే ఆఫర్
You can update your Aadhaar, even if your supporting documents are not available, with ‘Head of Family Based Aadhaar Update Option," by visiting Aadhaar centers near you. This facility is also available online on #myAadhaarPortal.https://t.co/sRWBSFZfWU@GoI_MeitY @mygovindia
— Aadhaar (@UIDAI) December 21, 2022
ఇక్కడ మూడు డాక్యుమెంట్స్ కీలకం. ఒకటి ప్రూఫ్ ఆఫ్ రిలేషన్‌షిప్ డాక్యుమెంట్. రెండోది కుటుంబ యజమాని డిక్లరేషన్. మూడోది కుటుంబ యజమాని ఆధార్ కార్డ్. ఈ మూడు ఉంటే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా తమకు ఎలాంటి ప్రూఫ్ లేకపోయినా ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయొచ్చు. ఆన్‌లైన్‌లో కూడా ఇలాగే అప్‌డేట్ చేయొచ్చు. అయితే కుటుంబ సభ్యులు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డిక్లరేషన్‌తో తమ ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసే సమయంలో కుటుంబ యజమాని బయోమెట్రిక్‌ను కూడా ఆధార్ సెంటర్‌లో తీసుకుంటారు.
హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ డిక్లరేషన్‌తో వారి భార్త, భర్త, కూతురు, కొడుకు తమ ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయొచ్చు. అయితే ప్రూఫ్ ఆఫ్ రిలేషన్‌షిప్ తప్పనిసరి. ప్రూఫ్ ఆఫ్ రిలేషన్‌షిప్ కోసం పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్, పెన్షన్ కార్డ్, మ్యారేజ్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్‌ను చూపించవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి.
LIC Policy: నెలకు రూ.1200 ప్రీమియం... రూ.25 లక్షల బెనిఫిట్... ఎల్ఐసీ పాలసీ వివరాలివే
Step 1- ముందుగా https://myaadhaar.uidai.gov.in/ ఓపెన్ చేయాలి.
Step 2- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 3- Online Update Services పైన క్లిక్ చేయాలి.
Step 4- ఆ తర్వాత Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.
Step 5- Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
Step 6- పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఆప్షన్స్‌లో మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.
Step 7- మీ వివరాలు అప్‌డేట్ చేసి అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
పేమెంట్ చేసి ప్రాసెస్ పూర్తి చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aadhaar Card, AADHAR, UIDAI