GOOD NEWS FOR AADHAAR CARD HOLDERS NOW YOU CAN UPDATE YOUR DEMOGRAPHIC DETAILS LIKE NAME GENDER DOB AND ADDRESS ONLINE THROUGH MAADHAAR APP SS
Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్లైన్లోనే
Aadhaar Update: ఇక ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు... ఈ సేవలన్నీ ఆన్లైన్లోనే
(ప్రతీకాత్మక చిత్రం)
Aadhaar Card Update | ఆధార్ కార్డులో వివరాలు అప్డేట్ చేయడానికి ప్రతీసారి ఆధార్ సెంటర్‌కు (Aadhaar Center) వెళ్లాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లోనే కొన్ని వివరాలు అప్డేట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
ఆధార్ కార్డ్ హోల్డర్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మరిన్ని సేవల్ని ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఇక ప్రతీ సర్వీస్ కోసం ఆధార్ సేవా కేంద్రానికో (Aadhaar Seva Kendra), ఆధార్ సెంటర్‌కో వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడ గంటల తరబడి క్యూలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో కూర్చొనే ఆన్లైన్లో కొన్ని సేవల్ని పొందొచ్చు. డెమోగ్రఫిక్ డీటెయిల్స్ అంటే పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ లాంటి వివరాలను ఆన్లైన్లోనే పొందొచ్చని యూఐడీఏఐ ట్వీట్ చేసింది. ఎంఆధార్ యాప్‌లో (mAadhaar App) వీటిని మార్చుకోవచ్చని తెలిపింది.
ఆధార్ కార్డ్ హోల్డర్లు పేరును రెండుసార్లు మార్చుకోవచ్చు. అయితే చిన్న మార్పుల్నే అనుమతిస్తారు. జెండర్‌ను ఒకసారి మార్చుకోవచ్చు. పుట్టినతేదీని కూడా ఓసారి మార్చుకోవచ్చు. అడ్రస్ ఎన్నిసార్లైనా మార్చవచ్చు. ప్రతీ రిక్వెస్ట్‌కు రూ.50 చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ వివరాలను కూడా అప్డేట్ చేయడం సాధ్యం. మరి ఎంఆధార్ యాప్‌లో పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ ఎలా మార్చాలో తెలుసుకోండి.
Update your demographic details like Name (Only Minor Changes allowed, Twice), Gender (Once), DoB (Once), and Address (No limit) online through #mAadhaarApp.
Charges: ₹50 per request, more than one detail can be updated at once.
ఎంఆధార్ యాప్ గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. మీరు ఇప్పటికే ఈ యాప్ ఉపయోగిస్తున్నట్టైతే లేటెస్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయాలని యూఐడీఏఐ కోరుతోంది. ఎంఆధార్ యాప్‌లో 35 రకాల ఆధార్ సేవలు పొందొచ్చు. ఎంఆధార్ యాప్ 13 భాషల్లో ఉపయోగించొచ్చు. ఈ యాప్‌లో మీ కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఒక యాప్‌లో ఐదుగురి ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ డౌన్లోడ్, ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్, ఆధార్ బయోమెట్రిక్స్ లాక్, అన్‌లాక్, ఆధార్ అప్డేట్ స్టేటస్ లాంటి అనేక సేవల్ని పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.