హోమ్ /వార్తలు /బిజినెస్ /

Aadhaar Card Update: తెలుగులో మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయండి ఇలా

Aadhaar Card Update: తెలుగులో మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయండి ఇలా

యూఐడీఏఐ సీఈఓ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఆధార్‌ని ప్రభావితం చేసే చేసే సామర్థ్యం అపారమైనదని అన్నారు.

యూఐడీఏఐ సీఈఓ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగంలో ఆధార్‌ని ప్రభావితం చేసే చేసే సామర్థ్యం అపారమైనదని అన్నారు.

Aadhaar Card Update | మీరు మీ ఆధార్ కార్డ్ (Aadhaar Card) అప్‌డేట్ చేయాలనుకుంటున్నారా? తెలుగులో కూడా ఆధార్ కార్డులో వివరాలను అప్‌డేట్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

ఆధార్ కార్డ్ యూజర్లకు శుభవార్త. ఆధార్ కార్డ్ (Aadhaar Card) సేవల్ని అందిస్తున్న యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరిన్ని సేవల్ని ఆధార్ కార్డ్ హోల్డర్లకు అందిస్తోంది. యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్, ఎంఆధార్ యాప్‌లో ఆధార్ కార్డుకు సంబంధించిన సేవల్ని పొందొచ్చు. ఇప్పుడు ఆధార్ కార్డ్ హోల్డర్లకు ఉపయోగపడే మరో ఫీచర్‌ని అందిస్తోంది యూఐడీఏఐ. సాధారణంగా ఆధార్ కార్డ్ సేవలు ఇంగ్లీష్‌లోనే లభించేవి. కానీ ఇప్పుడు ప్రాంతీయ భాషల్లో కూడా ఆధార్ కార్డ్ సేవల్ని అందిస్తోంది యూఐడీఏఐ. తెలుగుతో పాటు ఉర్దూ, హిందీ, కన్నడ, తమిళ్, పంజాబీ, బెంగాలీ, గుజరాతీ, మళయాళం, మరాఠీ, ఒడియా లాంటి భాషల్లో ఆధార్ సేవల్ని పొందదొచ్చు.

Aadhaar Bank Account Link: మీ ఆధార్ నెంబర్ ఏ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిందో తెలుసా? ఇలా తెలుసుకోండి

మీ ఆధార్ కార్డులో ఏవైనా అప్‌డేట్స్ చేయాలన్నా ప్రాంతీయ భాషల్లో చేయడం సులువే. అయితే ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయాలంటే మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ రిజిస్టర్ చేయడం తప్పనిసరి. ఒకవేళ మీ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ లేకపోయినా, అప్‌డేట్ చేయకపోయినా ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ ఏ మొబైల్ నెంబర్ లింక్ చేశారో తెలియకపోతే ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. ఇక తెలుగులో ఆధార్ కార్డ్ ఎలా అప్‌డేట్ చేయాలో తెలుసుకోండి.

Aadhaar Card: మీ పేరుతో ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకున్నారా? ఇలా చెక్ చేయండి

Aadhaar Card Update: తెలుగులో ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవండి


Step 1- ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ https://uidai.gov.in/ ఓపెన్ చేయండి.

Step 2- హోమ్ పేజీలో Update Aadhaar సెక్షన్‌లో Update Demographic Data Online పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్‌డేట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.

Step 4- మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

Step 5- క్యాప్చా సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి.

Step 6- Generate OTP పైన క్లిక్ చేయాలి.

Step 7- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.

Step 8- ఆ తర్వాత Update Demographics Data పైన క్లిక్ చేయాలి.

Step 9- మీరు కోరుకున్న భాషను సెలెక్ట్ చేయాలి.

Step 10- మీరు కోరుకున్న భాషలో వివరాలు ఎంటర్ చేయాలి.

Step 11- వివరాలన్నీ ఓసారి సరిచూసుకొని సబ్మిట్ చేయాలి.

Step 12- మళ్లీ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

Step 13- ఓటీపీ ఎంటర్ చేసి రూ.50 ఫీజు చెల్లించాలి.

Step 14- దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది.

Step 15- మీ ఆధార్ కార్డులో అప్‌డేట్స్ జరగడానికి ఒకటి నుంచి మూడు వారాల సమయం పడుతుంది.

Step 16- ఆ తర్వాత ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయాలి.

First published:

Tags: Aadhaar Card, Aadhaar card, AADHAR, UIDAI

ఉత్తమ కథలు