Good News: ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచే అవకాశం... పీఎఫ్ వడ్డీ రేటు యథాతథం

EPFO: ఈపీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ లింక్... ఉమాంగ్ యాప్‌లో చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

ఈపీఎస్ 1995 పథకంలో నుంచి కనీస పెన్షన్ రూ.1,000 ఉండగా, అసంఘటిత రంగ కార్మికులకు రూ.3,000 పెన్షన్ ఇవ్వడంపై చర్చ మొదలైంది. ఈపీఎస్ ఖాతాదారులకు కనీస పెన్షన్‌ను పెంచాలన్న డిమాండ్లు ఎప్పట్నుంచో ఉన్నవే.

  • Share this:
    ఎంప్లాయి పెన్షన్ స్కీమ్(EPS) ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎస్ సబ్‌స్క్రైబర్లకు ఇక కనీస పెన్షన్ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ రూ.1,000 మాత్రమే. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రధాన మంత్రి శ్రమ్ యోగీ మాన్-ధన్ పథకాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ పథకంలో చేసిన అసంఘటిత రంగ కార్మికులకు రూ.3,000 పెన్షన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈపీఎస్ 1995 పథకంలో నుంచి కనీస పెన్షన్ రూ.1,000 ఉండగా, అసంఘటిత రంగ కార్మికులకు రూ.3,000 పెన్షన్ ఇవ్వడంపై చర్చ మొదలైంది. ఈపీఎస్ ఖాతాదారులకు కనీస పెన్షన్‌ను పెంచాలన్న డిమాండ్లు ఎప్పట్నుంచో ఉన్నవే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) సభ్యుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ ప్రధాన కార్యదర్శి విర్జేష్ ఉపాధ్యాయ్ కూడా ఈపీఎస్ కనీస పెన్షన్ రూ.3,000 చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

    Read this: Flipkart Mobiles Bonanza: ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు

    ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) పరిపాలన సంస్థ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(CBT) మధ్య గురువారం జరిగే సమావేశంలో కనీస పెన్షన్ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కనీస పెన్షన్ పెంచితే 50 లక్షల మంది ఈపీఎస్ ఖాతాదారులకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుతం ఈపీఎస్ 1995 పథకంలో భాగంగా ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కనీస పెన్షన్ రూ.1,000 లభిస్తోంది. EPFO ఖాతాదారులుగా పదేళ్లు పూర్తి చేసుకున్నవాళ్లందరూ ఎంప్లాయి పెన్షన్ స్కీమ్‌ కింద పెన్షన్‌కు అర్హులు.

    Read this: మీ అమ్మాయి పెళ్లికి రూ.1 కోటి... సేవింగ్స్‌లో ఏ స్కీమ్ బెటర్?

    గురువారం జరిగే సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ వడ్డీ రేట్లపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే వడ్డీ రేటు ప్రస్తుతం 8.55% ఉంది. వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ చిన్న మొత్తాల పొదుపు పథకాలల్లో పీఎఫ్‌పై ఇచ్చే 8.55% శాతం వడ్డీ రేటు ఎక్కువే. ఇటీవల వడ్డీ రేట్లు తగ్గినా పీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచడం 6 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తుందని అంచనా. గురువారం జరగబోయే సీబీటీ మీటింగ్ కంటే ముందే జరగబోయే ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ(FIAC) సమావేశంలో వీటిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

    Photos: సముద్రం మధ్యలో సూపర్ మార్కెట్... ఎలా ఉందో చూడండి

    ఇవి కూడా చదవండి:

    Good News: ప్యాకేజీల ధరలు తగ్గిస్తున్న డిష్‌టీవీ, సన్‌డైరెక్ట్, టాటాస్కై

    IRCTC Discount: టికెట్ బుకింగ్‌లో వృద్ధులకు మినహాయింపు... నిబంధనలు ఇవే

    PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి
    First published: