డైరెక్ట్ టు హోమ్-DTH సర్వీస్ ప్రొవైడర్ టాటా స్కై సబ్స్క్రిప్షన్ విధానాల్లో కొన్ని మార్పులు చేస్తోంది. ఛానెళ్లు, ఛానెళ్ల ప్యాకేజీలపై ఇకపై లాక్-ఇన్ పీరియడ్ ఉండదు. అంటే మీరు ఓ ఛానెల్ లేదా ప్యాక్ ఎంపిక చేసుకున్న తర్వాత కొంతకాలం ఆ సేవలే ఉపయోగించాలన్న నిబంధనలు ఏవీ ఉండదు. టాటా స్కై యూజర్లు ఎప్పుడైనా, ఏ ఛానెల్ అయినా సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు, డ్రాప్ చేసుకోవచ్చు. గతంలో ప్యాకేజీని బట్టి ఛానెళ్లకు 30 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ లాక్-ఇన్ పీరియడ్ ఉండేది. కొద్ది రోజుల క్రితమే ఛానెళ్లు, ప్యాకేజీల ధరల విధానాన్ని మార్చిన టాటా స్కై... ఇప్పుడు లాక్-ఇన్ పీరియడ్‌ను పూర్తిగా తొలగించింది.
గతంలో మీరు ఏదైనా ఛానెల్ ఎంచుకుంటే మీకు ఆ ఛానెల్ నచ్చినా, నచ్చకపోయినా, వద్దనుకున్నా వెంటనే మార్చుకునే అవకాశం లేకపోయేది. లాక్-ఇన్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆ ఛానెల్ మీ లిస్ట్‌లో ఉంటుంది. ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు పాలసీ మారింది. లాక్-ఇన్ పీరియడ్ తొలగిపోయింది. ఈ కొత్త విధానం అలా-కార్టే ఛానెళ్లతో పాటు బేస్ ప్యాక్స్, యాడ్-ఆన్ ప్యాక్స్‌కు వర్తిస్తుంది. ఇక మీరు ఎంచుకున్న ఛానెల్ నచ్చకపోతే వెంటనే మార్పులు చేసుకోవచ్చు.
లాక్-ఇన్ పీరియడ్ తొలగిస్తూ టాటా స్కై మాత్రమే కాదు... కొద్ది రోజుల క్రితం డిష్ టీవీ కూడా నిర్ణయం తీసుకుంది. లాక్-ఇన్ పీరియడ్ తొలగించడం ద్వారా యూజర్లకు ఛానెళ్లు ఎంచుకునేందుకు ఎక్కువ స్వేచ్ఛ లభిస్తుంది.
Photos: అదిరిపోయిన ఒప్పో ఎఫ్11 ప్రో అవెంజర్స్ ఎడిషన్
ఇవి కూడా చదవండి:
Paytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా
PAN Card: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీయాక్టివేట్... కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం
WhatsApp: వాట్సప్ ఫోటోలు, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ ట్రై చేయండి
Indian Railways: రైళ్లలో పాటలు, సినిమాలు... ప్రయాణికులకు ఫుల్ టైంపాస్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.