• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • GOOD NEWS CARS24 OFFERING LOANS TO CUSTOMERS ON THEIR EXISTING CARS SS

Loan: మీ దగ్గర కారు ఉందా? లోన్ ఇస్తామంటున్న కార్స్24

Loan: మీ దగ్గర కారు ఉందా? లోన్ ఇస్తామంటున్న కార్స్24

Loan: మీ దగ్గర కారు ఉందా? లోన్ ఇస్తామంటున్న కార్స్24 (ప్రతీకాత్మక చిత్రం)

CARS24 Loans | కారు అమ్మేయాలనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పింది కార్స్24. కారు అమ్మాల్సిన అవసరం లేకుండా తాము రుణాలు ఇస్తామంటోంది.

  • Share this:
    మీ దగ్గర కారు ఉందా? ఆర్థిక ఇబ్బందుల వల్ల కారు అమ్మేద్దామనుకుంటున్నారా? సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మడానికి కొనడానికి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ అయిన కార్స్24 మీ పాత కారుకు లోన్ ఇస్తామంటోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి చేయూతనిచ్చేందుకు లోన్స్ ఆఫర్ చేస్తోంది. గతంతో పోలిస్తే కరోనా వైరస్ సంక్షోభ కాలంలో కార్లు అమ్ముతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్టు కార్స్24 పరిశీలనలో తేలింది. ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సమస్యల్ని పరిష్కరించుకోవడానికే ఇష్టం లేకపోయినా కార్లు అమ్ముతున్నట్టు కార్స్24 గుర్తించింది. అందుకే లోన్లు ఇస్తామంటోంది. కార్లు అమ్మడానికి ఇష్టం లేని వాళ్లు తాత్కాలికంగా ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి ఈ లోన్లు తీసుకోవచ్చు. కారు విలువ ఎంత ఉంటే అంత వరకు లోన్ ఇవ్వనుంది. అంటే కారు విలువ రూ.5,00,000 ఉంటే 100 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు. లోన్‌పై వడ్డీ 14 శాతం నుంచి మొదలవుతుంది. కస్టమర్లు పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, కార్ ఆర్‌సీ, కార్ ఇన్స్యూరెన్స్, బ్యాంక్ స్టేట్మెంట్ లాంటివి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

    ప్రస్తుతం న్యూ ఢిల్లీలోని కస్టమర్లకు మాత్రమే లోన్లు ఇస్తోంది కార్స్24. కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దీంతో వచ్చే నెలలో హైదరాబాద్‌తో పాటు బెంగళూరులోని కస్టమర్లకు కూడా లోన్స్ ఇవ్వనుంది. అంతేకాదు... ఈ ఆర్థిక సంవత్సరంలోనే మరిన్ని మెట్రో నగరాల్లో పాత కార్లకు లోన్స్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. లోన్ ఇచ్చేముందు కస్టమర్ల ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్, కార్ల విలువ లాంటివన్నీ పరిశీలించి రుణం మంజూరు చేయనుంది ఈ సంస్థ.
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు