హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cylinder Booking: వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్... చేయండి ఇలా

Cylinder Booking: వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్... చేయండి ఇలా

Cylinder Booking: వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్... చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Cylinder Booking: వాట్సప్ ద్వారా సిలిండర్ బుకింగ్... చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Cylinder Booking | ఇకపై వాట్సప్ ద్వారా సిలిండర్ బుక్ చేయొచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి మెసేజ్ చేస్తే చాలు. ఎలాగో తెలుసుకోండి.

ఇంట్లో సిలిండర్ వాడేవారికి గుడ్ న్యూస్. ఇక మీరు సిలిండర్ బుక్ చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీ ఫోన్‌లో వాట్సప్ ఉంటే చాలు. ఈజీగా సిలిండర్ బుక్ చేయొచ్చు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-BPCL ఈ కొత్త విధానాన్ని ప్రారంభించింది. దేశంలోని భారత్ గ్యాస్ కస్టమర్లు అందరూ ఇక వాట్సప్ ద్వారా సులువుగా సిలిండర్ బుక్ చేయొచ్చు. భారత్ గ్యాస్‌ కస్టమర్ల సంఖ్య 7.1 కోట్లు. ఇండియన్ ఆయిల్ తర్వాత భారత్ గ్యాస్‌కు ఎక్కువ మంది ఎల్‌పీజీ కస్టమర్లు ఉన్నారు. ఈ కస్టమర్లు వాట్సప్ నుంచి సిలిండర్ బుక్ చేయడానికి బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ను ప్రారంభించారు. కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 1800224344 నెంబర్‌కు వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు. సిలిండర్ బుక్ అవుతుంది.

వాట్సప్ ద్వారా ఎల్‌పీజీ బుక్ చేయడం కస్టమర్లకు చాలా సులువు. పిల్లల నుంచి పెద్దల వరకు వాట్సప్ సాధారణంగా ఉపయోగించే యాప్‌గా మారిపోవడంతో, ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి సిలిండర్ బుక్ చేసే సదుపాయాన్ని కస్టమర్లకు కల్పిస్తున్నాం.

అరుణ్ సింగ్, మార్కెటింగ్ డైరెక్టర్, బీపీసీఎల్

కస్టమర్లు వాట్సప్ ద్వారా భారత్ గ్యాస్ బుక్ చేయడానికి ముందుగా బీపీసీఎల్ స్మార్ట్‌లైన్ నెంబర్‌ 1800224344 సేవ్ చేసుకోవాలి. మొదట Hi అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత Book లేదా 1 అని మెసేజ్ చేయాలి. తర్వాత బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ కన్ఫర్మేషన్ మెసేజ్‌లో పేమెంట్ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, ఇతర వ్యాలెట్స్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. కేవలం సిలిండర్ బుక్ చేయడం మాత్రమే కాదు డెలివరీ ట్రాకింగ్, ఫీడ్‌బ్యాక్ లాంటి సేవలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఇక ఇప్పటికే ఐవీఆర్ఎస్, మిస్డ్ కాల్, యాప్స్, వెబ్‌సైట్ ద్వారా సిలిండర్ బుక్ చేసే సదుపాయం ఉన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

LIC: ఈ పాలసీ రూల్స్ మార్చిన ఎల్ఐసీ... కొత్త నిబంధనలివే

Job Loss: ఉద్యోగం పోతే ప్రభుత్వం నుంచి సాయం... పొందండి ఇలా

Smartphone: రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

First published:

Tags: Bharat Gas, Bharat Petroleum Corporation Limited, LPG Cylinder

ఉత్తమ కథలు