• HOME
 • »
 • NEWS
 • »
 • BUSINESS
 • »
 • GOOD NEWS BANKS TO REFUND CHARGES COLLECTED FOR UPI TRANSACTIONS SINCE 2020 JANUARY SS

UPI Payment: గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్స్ చేసినవారికి గుడ్ న్యూస్

UPI Payment: గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్స్ చేసినవారికి గుడ్ న్యూస్

UPI Payment: గూగుల్ పే, ఫోన్‌పే పేమెంట్స్ చేసినవారికి గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

UPI Payment | గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లాంటి యాప్స్ ద్వారా ఈ ఏడాదిలో మీరు ఏవైనా యూపీఐ లావాదేవీలు జరిపారా? అయితే మీకు గుడ్ న్యూస్.

 • Share this:
  మీరు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసేందుకు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా? పేమెంట్స్ కోసం ఫోన్‌పే వాడుతున్నారా? పేటీఎం యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యూపీఐ లావాదేవీలపై మీరు చెల్లించిన ఛార్జీలన్నీ వెనక్కి రానున్నాయి. 2020 జనవరి 1 నుంచి జరిపిన యూపీఐ లావాదేవీలన్నింటికీ ఇది వర్తిస్తుంది. పీఎస్ఎస్ చట్టంలోని సెక్షన్ 10ఏ ప్రకారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో జరిపిన పేమెంట్స్‌కి మర్చంట్ డిస్కౌంట్ రేట్ సహా ఎలాంటి ఛార్జీలు వర్తించవు అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT సర్క్యులర్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రైవేట్ బ్యాంకులు యూపీఐ పేమెంట్స్‌కు వసూలు చేస్తున్న ఛార్జీలను ఎత్తేశాయి. ప్రజలు డిజిటల్ లావాదేవీలు జరిపేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో జరిపిన యూపీఐ లావాదేవీలకు వసూలు చేసిన ఛార్జీలను రీఫండ్ చేయడం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని బ్యాంకుల్ని ఆదేశించింది.

  FASTag: అలర్ట్... ఫాస్ట్ ట్యాగ్‌పై కొత్త రూల్స్ ప్రకటించిన మోదీ ప్రభుత్వం

  SBI Loan: ఎస్‌బీఐలో ఏ లోన్ అయినా 59 నిమిషాల్లో తీసుకోవచ్చు... ఈ స్టెప్స్ ఫాలో అవండి

  మీరు ఈ ఏడాదిలో జరిపిన యూపీఐ పేమెంట్స్‌కి ఛార్జీలు చెల్లించినట్టైతే రీఫండ్ లభిస్తుంది. బ్యాంకులు మీ అకౌంట్లలోకి ఈ ఛార్జీలను రీఫండ్ చేయనున్నాయి. ఇలా ఛార్జీల రూపంలో వసూలు చేసిన మొత్తం రూ.50 కోట్లకు పైనే ఉందని అంచనా. ఆ మొత్తం త్వరలో లావాదేవీలు జరిపినవారి అకౌంట్లలోకి వెళ్లనున్నాయి. రూపే, యూపీఐ, భీమ్ యూపీఐ, యూపీఐ క్విక్ రెస్పాన్స్ కోడ్ లాంటి పేమెంట్స్ అన్నింటికీ ఇది వర్తిస్తుంది. ప్రైవేట్ బ్యాంకులు యూపీఐ ఛార్జీలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు గత మూడు నాలుగు నెలలుగా ఈ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. నెలలో 20 లావాదేవీల కన్నా ఎక్కువ జరిపినట్టైతే రూ.2.5 నుంచి రూ.5 మధ్య వసూలు చేశాయి. ప్రస్తుతం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్-CBDT సర్క్యులర్‌తో ఆ ఛార్జీలను ఎత్తేయాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకులు యూపీఐ ట్రాన్సాక్షన్స్‌పై ఎలాంటి ఛార్జీలు వసూలు చేయలేదు.

  EMI Moratorium: మారటోరియంతో ఈఎంఐ వాయిదా వేశారా? రీపేమెంట్ లెక్క ఇదే

  Digital Gold: అమెజాన్ యూజర్లు రూ.5 ధరకే బంగారం కొనొచ్చు

  ఇక జూలైలో అత్యధికంగా 150 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, యెస్ బ్యాంక్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఈ లావాదేవీలు జరిగాయి.
  Published by:Santhosh Kumar S
  First published: