ఇది ఫేక్ న్యూస్ కాదు నిజం...ఒక కేజీ అస్సాం టీ పొడి ధర రూ.70 వేల పై మాటే...

మనోహరి గోల్డ్ ఎస్పిసిఎల్ కిలోకు 50 వేలకు రూపాయలు చెల్లించి సౌరభ్ టీ ట్రేడర్స్ కొనుగోలు చేసి కొత్త రికార్డు స్థాపించగా, తాజాగా మైజన్ టీ ఎస్టేట్ కేజీ టీ ధర రూ. 70 వేలకు పైగా ధర పలికి వార్తల్లో నిలిచింది.

news18-telugu
Updated: July 31, 2019, 5:15 PM IST
ఇది ఫేక్ న్యూస్ కాదు నిజం...ఒక కేజీ అస్సాం టీ పొడి ధర రూ.70 వేల పై మాటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గువహతి టీ వేలం కేంద్రం నూతన రికార్డులు స్థాపించే దిశగా కదులుతోంది. ఇక్కడ వేలం వేస్తున్న స్పెషల్ అస్సాం టీ పొడి వేలం పాటలో ఎవరూ ఊహించని విధంగా ధర పలుకుతోంది. తాజాగా ది అస్సాం కంపెనీ లిమిటెడ్‌కు చెందిన మైజన్ టీ ఎస్టేట్ నుండి గోల్డెన్ టిప్స్ లైన్ టీ పౌడర్ కిలోకు రూ.70501 ధర పలికి కొత్త రికార్డు ధరకు అమ్ముడైంది. ఈ టీని గువహతికి చెందిన ముంధ్రా టీ కంపెనీ కొనుగోలు చేసింది. వీరితో పాటు మరో క్లయింట్ బెల్జియంకు చెందిన స్టీవెన్ ప్లేజియర్ అలాగే గువహటికి చెందిన ఆన్‌లైన్ టీ స్టోర్ నమహా మార్కెటింగ్ సంయుక్తంగా పంచుకోనున్నారు. అయితే తాము రికార్డు ధరతో కొన్న ఈ టీని జైపూర్‌కు చెందిన మహేశ్వరి టీ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు విక్రయిస్తానని నమహా ఓనర్ రమేష్ ముంద్రా తెలిపారు.

ఇదిలా ఉంటే మైజన్ టీ కోసం మరో ఇద్దరు కొనుగోలుదారులు పోటీ పడ్డారు. అరిహంత్ టీ కంపెనీకి చెందిన ప్రకాష్ చజ్జెర్ రూ .70100 బిడ్ వేయగా స్వల్ప తేడాతో కోల్పోయారు. ఇదిలా ఉంటే ఇప్పటికే రెండు కిలోల మనోహరి గోల్డ్ ఎస్పిసిఎల్ కిలోకు 50 వేలకు రూపాయలు చెల్లించి సౌరభ్ టీ ట్రేడర్స్ కొనుగోలు చేసి కొత్త రికార్డు స్థాపించగా, తాజాగా మైజన్ టీ ఎస్టేట్ కేజీ టీ ధర రూ. 70 వేలకు పైగా ధర పలికి వార్తల్లో నిలిచింది.First published: July 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...