అక్టోబర్ 23న ధంతేరాస్ (Dhanteras) పర్వదినం ఉంది. ఆ రోజున బంగారు నగలు కొనడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్స్, బంగారు ఆభరణాలు (Gold Jewellery) కొనడానికి పోటీ పడుతుంటారు. దేశమంతా ఆ ఒక్కరోజే వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. నగల షాపులన్నీ కిటకిటలాడుతుంటాయి. మరి మీరు కూడా ధంతేరాస్ రోజున గోల్డ్ కొనాలనుకుంటున్నారా? బంగారం కొంటే ట్యాక్స్ చెల్లించాలి. అయితే మీరు బంగారం ఏ రూపంలో కొన్నారనేదానిపై ట్యాక్స్ ఆధారపడి ఉంటుంది. మరి ఫిజికల్ గోల్డ్ కొంటే ట్యాక్స్ ఎంత? డిజిటల్ గోల్డ్‌కు పన్నులు ఎలా వర్తిస్తాయి? పేపర్ గోల్డ్‌కు పన్నులు ఉంటాయా? తెలుసుకోండి.
ఫిజికల్ గోల్డ్ అంటే బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్స్ లాంటివాటికి 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. బంగారు ఆభరణాలు చేయిస్తే మేకింగ్ ఛార్జీలపైన అదనంగా 5 శాతం పన్నులు ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర ఉన్న గోల్డ్ కాయిన్స్ లేదా గోల్డ్ బిస్కిట్లను ఎక్స్ఛేంజ్ చేసి, అంతే బరువుతో నగలు చేయిస్తే జీఎస్టీ ఉండదు. బరువు ఎక్కువ ఉంటే ఆ మొత్తానికి జీఎస్టీ చెల్లించాలి.
Gold Price Today: పసిడిప్రేమికులకు శుభవార్త... ధంతేరాస్ ముందు తగ్గిన బంగారం ధర
ఇక ఇటీవల డిజిటల్ గోల్డ్ కొనేవారి సంఖ్య పెరుగుతోంది. బంగారు ఆభరణాలు, గోల్డ్ కాయిన్స్, గోల్డ్ బిస్కిట్స్ కొంటే వాటిని భద్రపర్చడం ఓ సవాల్. అందుకే డిజిటల్ గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నవారు ఉన్నాయి. డిజిటల్ గోల్డ్ కొన్నా 3 శాతం జీఎస్టీ చెల్లించాలి. మీరు డిజిటల్ గోల్డ్ 36 నెలల లోపు హోల్డ్ చేసి అమ్మితే పన్నులు ఏమీ ఉండవు. అంతకన్నా ఎక్కువ రోజులు డిజిటల్ గోల్డ్ హోల్డ్ చేసి అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాలి. దీంతో పాటు సర్‌ఛార్జీ, 4 శాతం సెస్ అదనంగా చెల్లించాలి.
Save Money: ప్రతి నెలా రూ.500 ఇన్వెస్ట్మెంట్... రూ.2.5 లక్షలకుపైగా రిటర్న్స్... పూర్తి వివరాలు ఇవే
సావరిన్ గోల్డ్ బాండ్, గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లాంటివాటిని పేపర్ గోల్డ్ అంటారు. కొనేప్పుడు వీటిపైనా ఫిజికల్ గోల్డ్‌కు ఉన్నట్టు పన్నులు ఉంటాయి. సావరిన్ గోల్డ్ బాండ్ పన్ను రూల్స్ వేరుగా ఉన్నాయి. సావరిన్ గోల్డ్ బాండ్‌పై 2.5 శాతం వార్షిక వడ్డీ వస్తుంది. ఈ వడ్డీని ఆదాయంలో చూపించి, వారి ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే 8 ఏళ్ల మెచ్యూరిటీ కాలం హోల్డ్ చేసి క్యాపిటల్ గెయిన్స్ పొందితే మెచ్యూరిటీ సమయంలో ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhanteras, Dhanteras 2022, Gold bars, Gold coins, Gold jewellery, Gold Prices