Gold rates in Hyderabad : బంగారం ధర రికార్డు ధరకు చేరుకుంటోంది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధర ఈ రోజు కూడా అదే దిశగా పరుగెడుతోంది. బంగారంతో పాటు వెండి కూడా ప్రియం అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం నాడు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.400 పెరుగుదలతో రూ.44,500కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.410 పెరిగి రూ.40,840కు చేరింది. కిలో వెండి ధర రూ.150 పెరిగి రూ.41,300కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ ఉండటం వల్ల వెండి రేటు పెరగడానికి కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరగడంతో వరుసగా ఐదో రోజు కూడా బంగారం ధర పెరిగిందని అంటున్నారు.
అటు.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర ఔన్స్‌కు 0.41 శాతం పెరిగింది. దీంతో బంగారం ధర 1760 డాలర్ల పైకి చేరింది. ఔన్స్‌కు 1768.90 డాలర్ల వద్ద కదలాడుతోంది. వెండి ధర ఔన్స్‌కు 1.22 శాతం పెరుగుదలతో 15.72 డాలర్లకు చేరింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:April 14, 2020, 06:51 IST