హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Rate Today: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా

Gold Rate Today: షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. నేటి రేట్లు ఇలా

బంగారం ధర

బంగారం ధర

Gold Price Today | బంగారం కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మార్కెట్‌లో నేడు పసిడి రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి తెలుసుకోండి. బంగారం ధర గత రెండు రోజులుగా పెరుగుతూనే వస్తున్నాయి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Visakhapatnam

  Today God Rate | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? పసిడి రేటు పరుగులు పెడుతూ వస్తోంది. రెండు రోజులుగా బంగారం ధర (Gold Rate) పైపైకి కదిలింది. పసిడి, వెండి ప్రేమికులకు ఇది ప్రతికూల అంశం అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం (Gold), వెండి (Silver) ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.హైదరాబాద్‌లో బంగారం ధర సెప్టెంబర్ 9న పైపైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 110 మేర పెరిగింది. దీంతో బంగారం ధర రూ. 51 వేలకు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 100 మేర ర్యాలీ చేసింది. దీంతో ఈ పుత్తడి ధర రూ. 46,750కు చేరింది. కాగా ఈ పసిడి రేట్లకు జీఎస్‌టీ , తయారీ చార్జీలు వంటివి అదనం అని గుర్తించుకోవాలి. కాగా బంగారం ధర నిన్న కూడా పెరిగింది. నిన్న పసిడి రేటు రూ. 270 వరకు ర్యాలీ చేసింది.
  లోన్ డబ్బులు వీటి కోసం ఉపయోగిస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త!
  ఇక వెండి విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కూడా జిగేల్ మంది. పైపైకి దూసుకుపోయింది. వెండి రేటు ధర ఈ రోజు రూ. 800 మేర పెరిగింది. దీంతో కేజీ సిల్వర్ రేటు మళ్లీ రూ. 60 వేల పైకి చేరింది. రూ. 60,300కు చేరింది. వెండి పట్టీలు, కడియాలు, ఇతర సిల్వర్ జువెలరీ కొనుగోలు దారులకు ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.
  కేవలం రూపాయితో రూ.54 కోట్లు.. ఇదెక్కడి మ్యాజిక్ రా మావ!


  గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. పసిడి రేటు ఔన్స్‌కు 0.67 శాతం మేర ర్యాలీ చేసింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1731 డాలర్లకు ఎగసింది. అలాగే సిల్వర్ రేటు కూడా మెరిసింది. భారీగా పెరిగింది. 1.5 శాతం మేర దూసుకుపోయింది. దీంతో వెండి ధర ఔన్స్‌కు 18.71 డాలర్లకు చేరింది. కాగా దేశంలో బంగారం ధరలు వచ్చే ఏడాది పది గ్రాములకు రూ. 60 వేలకు చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి.

  Published by:Khalimastanvali Khalimastanvali
  First published:

  Tags: Gold, Gold price, Gold rate, Gold rate hyderabad, Silver price, Silver rate

  ఉత్తమ కథలు