Gold Silver Rate Today | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్. పసిడి రేటు మళ్లీ పరగులు పెట్టింది. బంగారం ధర భారీగా పెరిగింది. పుత్తడి (Gold) ధగధగలాడుతోంది. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పైకి కదలడం గమనార్హం. దీంతో బంగారం ధరల (Gold Rates) తగ్గుదల ముచ్చట కేవలం ఒక్క రోజుగానే మిగిలింది. బంగారం ధరలు ఈ రోజు ఏ విధంగా పెరిగాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో డిసెంబర్ 7 బంగారం ధరలు మెరిశాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 మేర పరుగులు పెట్టింది. దీంతో ఈ బంగారం ధర పది గ్రాములకు రూ. 54 వేల స్థాయికి చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం రేటు విషయానికి వస్తే.. ఈ పుత్తడి రేటు కూడా రూ. 200 ర్యాలీ చేసింది. దీంతో ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 49,500కు చేరింది. అంటే బంగారం ధరలు ధగధగలాడుతున్నాయని చెప్పుకోవచ్చు.
ఇయర్ ఎండ్ ధమాకా ఆఫర్.. కారు కొంటే రూ.లక్షా 50 వేల డిస్కౌంట్!
మరోవైపు వెండి ధరల విషయానికి వస్తే.. సిల్వర్ కూడా జిగేల్ మంది. బంగారం ధర బాటలోనే పయనించింది. వెండి ధర రూ. 200 పైకి చేరింది. దీంతో కేజీ వెండి రేటు రూ. 71 వేలకు ఎగసింది. కాగా వెండి రేటు నిన్న రూ. 1700 మేర కుప్పకూలిన విషయం తెలిసిందే. అలాగే బంగారం ధరలు కూడా నిన్న తగ్గాయి. రూ. 330 మేర క్షీణించాయి. కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అదనం అని గుర్తించుకోవాలి. ఇంకా ఆభరణాల తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ కూడా అదనం. అందుకే బంగారం ధరల్ల కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు.
ఆర్బీఐ షాక్.. మీ పర్సనల్, హోమ్, కార్ లోన్ ఈఎంఐలు ఎంత పెరుగుతాయంటే?
కాగా అంతర్జాతీయ మార్కెట్లో చూస్తే బంగారం ధర మళ్లీ మెరిసింది. పసిడి రేటు ఈరోజు ఔన్స్‌కు 0.7 శాతం మేర పైకి కదిలింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1794 డాలర్లకు ఎగసింది. ఇక వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఏకంగా 2.3 శాతం పెరిగింది. ఔన్స్‌కు 22.85 డాలర్ల వద్ద కదలాడుతోంది. కాగా బంగారం ధర ఇటీవల 1810 డాలర్ల వరకు పెరిగాయి. అయితే తర్వాత మళ్లీ పసిడి రేటు 1750 డాలర్లకు పడిపోయింది. ఇప్పుడు మరోసారి గోల్డ్ రేటు పైపైకి కదులుతూ వస్తోంది. ఆర్థిక మాంద్యం భయాలతో పసిడి రేటు పైకి చేరుతోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today