Gold Rates Today: భారీగా పడిపోతున్న బంగారం ధరలు...హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే...

ప్రతీకాత్మకచిత్రం

కరోనా సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు కొంతమేర బలపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

 • Share this:
  కరోనా సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా మార్కెట్లు కొంతమేర బలపడటంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ఈరోజు బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అటు ఫ్యూచర్స్ మార్కెట్లో మాత్రం తగ్గాయి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి బంగారం మరియు వెండి ధరలు అస్థిరంగా ఉన్నాయి. మిశ్రమ గ్లోబల్ సిగ్నల్స్ కారణంగా మూడు రోజుల్లో బంగారం ధరలు రెండోసారి పడిపోయాయి. మంగళవారం, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్) లో బంగారు ఫ్యూచర్ల ధర 10 గ్రాములకు 0.03 శాతం పడిపోయింది. బంగారం మాదిరిగా, వెండికి కూడా బలహీనత చూపుతోంది. మార్చిలో వెండి ఫ్యూచర్స్ కిలోకు 0.22 పడిపోయింది. శుక్రవారం భారీ పతనం తరువాత, మునుపటి సెషన్లో బంగారం ధరలు 0.7 శాతం పెరిగాయి.

  ఎంసిఎక్స్ లో నేటి బంగారు ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ .14 తగ్గి రూ .49,328 కు చేరుకుంది. కాగా వెండి ధర కిలోకు రూ .155 తగ్గి రూ .65,400 వద్ద ట్రేడవుతోంది. నేడు, అంతర్జాతీయ మార్కెట్లో, బంగారం ధరలో లాభాల స్వీకరణ కనిపించింది.అలాగే అటు డాలర్ బలం కూడా తగ్గింది. ఫలితంగా స్పాట్ బంగారం 0.2 శాతం పెరిగి ఔన్సు 1847.96 డాలర్లకు చేరుకోగా, వెండి 0.8 శాతం పెరిగి 25.11 డాలర్లకు చేరుకుంది.

  సోమవారం, ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం రూ .389 పెరిగి 10 గ్రాములకు రూ .48,866 వద్ద ముగిసింది. అంతకుముందు ట్రేడింగ్ సెషన్లో బంగారం 10 గ్రాములకు రూ .48477 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్లో వెండి ధర కూడా కిలోకు రూ .1,138 పెరిగి రూ .64,726 కు చేరుకుంది.

  హైదరాబాద్ లో బంగారం
  ఈరోజు హైదరాబాద్ లోని బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 46,310 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ.50,510 కి చేరింది ఇక వెండి ధర మాత్రం ఈరోజు స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.69,000కి పలుకుతుంది.

  ఇక అటు జనవరి 11 నుండి జనవరి 15 వరకు సావరిన్ గోల్డ్ బాండ్ల పదవ సిరీస్ కింద పెట్టుబడి పెట్టవచ్చు. పదవ సిరీస్ కోసం, రిజర్వ్ బ్యాంక్ ఒక గ్రాము బంగారం ధరను 5104 రూపాయలుగా ఉంచింది. ఒక పెట్టుబడిదారుడు ఈ ఆన్‌లైన్ కోసం దరఖాస్తు చేసుకుని, డిజిటల్ మోడ్‌లో చెల్లిస్తే, అప్పుడు అతను గ్రాముకు 50 రూపాయల తగ్గింపును పొందుతాడు. అతనికి ఒక గ్రాము బంగారం ధర 5054 రూపాయలకు లభిస్తుంది.
  Published by:Krishna Adithya
  First published: