Gold Price Alert: 8 నెలల గరిష్ట స్థాయికి బంగారం ధర

అంతర్జాతీయ అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్న ఆందోళన కనిపిస్తోంది. అందుకే బంగారంపై దృష్టిపెట్టారు మదుపరులు. కొన్ని మార్కెట్లలో ఫిజికల్ డిమాండ్ పెరుగుతోంది. దాంతో పాటు ఈటీఎఫ్ కొనుగోళ్లు పెరిగాయి.

news18-telugu
Updated: January 30, 2019, 6:24 PM IST
Gold Price Alert: 8 నెలల గరిష్ట స్థాయికి బంగారం ధర
Gold Price Alert: 8 నెలల గరిష్ట స్థాయికి బంగారం ధర
  • Share this:
బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది గోల్డెన్ న్యూస్. బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న బంగారం ధరలు ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాయి. ఫెడ్ రేట్లల్లో మార్పులు ఉండకపోవచ్చన్న అంచనాలు, అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం లాంటివి బంగారం ధరలు పెరగడానికి కారణాలు. బుధవారం 8 నెలల గరిష్ట స్థాయికి చేరింది బంగారం ధర. ఔన్సు ధర 0.2 శాతం పెరిగి 1,315.49 డాలర్లకు చేరింది. 2018 మే 14 నుంచి ఇదే అధిక ధర కావడం విశేషం.

Read this: Facebook Tips: మీ ఫేస్‌బుక్‌లో చేయకూడని 9 అంశాలివే...

గతేడాది ఫెడ్ రేట్లు నాలుగు సార్లు పెరిగాయి. ఈసారి ఫెడ్ రేట్లల్లో మార్పులు ఉండకపోవచ్చని భావిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఇరాన్‌పై అమెరికా ఆంక్షల్ని ఉల్లంఘించిందన్న కారణంతో చైనాకు చెందిన హువావే టెక్నాలజీస్‌పై క్రిమినల్ ఛార్జెస్ తీసుకోవడం అమెరికా-చైనా మధ్య వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. ఇవన్నీ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తాయన్న ఆందోళన కనిపిస్తోంది. అందుకే బంగారంపై దృష్టిపెట్టారు మదుపరులు. కొన్ని మార్కెట్లలో ఫిజికల్ డిమాండ్ పెరుగుతోంది. దాంతో పాటు ఈటీఎఫ్ కొనుగోళ్లు పెరిగాయి.

Read this: మూడేళ్లలో ఈ 9 జాబ్స్‌కు ఫుల్ డిమాండ్... చేయాల్సిన కోర్సులివే



ఇవే కాదు వెనెజులా సంక్షోభం, బ్రెగ్జిట్‌పై ఆందోళనలు కూడా బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడుతున్నాయని మార్కెట్ నిపుణుల అంచనా. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.33,882, కాగా 22 క్యారెట్ బంగారం ధర రూ.31,680.

Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...
Loading...
ఇవి కూడా చదవండి:

జనవరిలో రిలీజైన టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు ఇవే... ఏది బెస్ట్?

IRCTC Refund Rules: ఐఆర్‌సీటీసీ ఇ-టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్ రూల్స్ ఇవే...

OMG: సెలవులు ఎన్‌క్యాష్ చేసుకుంటే రూ.19 కోట్లు వచ్చాయి
First published: January 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...