GOLD SALES ON DHANTERAS WERE MORE THAN EXPECTATIONS WITH 30 TONNES OF SALES SS
Gold Sales: ఒక్క రోజులో 30,000 కిలోల బంగారం అమ్మకాలు... ధన్తేరస్ రోజున రికార్డ్
Gold rate:
(ప్రతీకాత్మక చిత్రం)
Gold Sales on Dhanteras 2019 | ఆర్థిక మందగమనం, ఉద్యోగాల కోత, ఆదాయం తగ్గిపోవడం, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండటం, బంగారం ధరలు కాస్త పెరగడం లాంటి పరిణామాలతో ధన్తేరస్ రోజున బంగారం అమ్మకాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన వ్యాపారుల్లో కనిపించింది.
దీపావళి సీజన్లో బంగారం అమ్మకాలు ఎక్కువగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. దీపావళి ముందు వచ్చే ధన్తేరస్ పర్వదినాన బంగారం కొంటే అదృష్టం అన్న సెంటిమెంట్ చాలాకాలంగా ఉన్నదే. అందుకే ధన్తేరస్ రోజున బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి ధన్తేరస్ నాడు అంచనాలకు మించి బంగారం అమ్మకాలు జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. ధన్తేరస్ రోజున ఒక్కరోజే 30 టన్నులు అంటే 30,000 కిలోల బంగారం దేశవ్యాప్తంగా అమ్ముడు పోయినట్టు ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే 25 శాతం మాత్రమే అమ్మకాలు తగ్గాయి. అమ్మకాలు 25 శాతం తగ్గినా ఈసారి ఉన్న పరిస్థితులతో పోలిస్తే ఇది గొప్ప రికార్డేనని మార్కెట్ వర్గాల వాదన.
అధిక ధరల వల్ల దేశీయ మార్కెట్ స్తబ్దుగా ఉండటంతో ఈసారి ఈ స్థాయిలో అమ్మకాలను అంచనా వేయలేదు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరగడం, ఇంపోర్ట్ డ్యూటీ పెరగడం కారణంగా దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈసారి పండుగ సీజన్ ప్రారంభం కాగానే బంగారానికి డిమాండ్ తక్కువగా ఉంటుందని భావించాం. కానీ మూడు నాలుగు రోజుల్లో కొనుగోళ్లు పెరిగాయి. ఈ సారి ధన్తేరస్కు 30 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారు.
— సురేంద్ర మెహ్తా, జాతీయ కార్యదర్శి, ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్
వాస్తవానికి గతంలో ధన్తేరస్ రోజున 40 టన్నులు అంటే 40,000 కిలోల బంగారం అమ్మిన రికార్డులున్నాయి. కానీ... ఈసారి ఆర్థిక మందగమనం, ఉద్యోగాల కోత, ఆదాయం తగ్గిపోవడం, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండటం, బంగారం ధరలు కాస్త పెరగడం లాంటి పరిణామాలతో ధన్తేరస్ రోజున బంగారం అమ్మకాలు ఎలా ఉంటాయో అన్న ఆందోళన వ్యాపారుల్లో కనిపించింది. సగానికి పైగా సేల్స్ పడిపోవచ్చని ఓ దశలో భావించారు. అంటే గతంలో ధన్తేరస్ రోజున 40 టన్నులు అమ్మితే ఈసారి మాత్రం 20 టన్నులు అమ్మితే గొప్ప అనుకున్నారు. కానీ ఈ ధన్తేరస్ నాడు అంచనాలకు మించి నగల అమ్మకాలు జరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు.
తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్ఫోన్ వచ్చేసింది... రెడ్మీ 8 ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.