Gold Rate in Hyderabad : బంగారం ధరల్లో సందిగ్ధత నెలకొంది. అయితే ఓ వారం భారీగా పెరిగితే, మరో వారం భారీగా పతనం అవుతున్నాయి. దీంతో పసిడి బాట ఎటువైపు అనేది బులియన్ పండితులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. (gold rate in hyderabad today) గతేడాది బంగారం రూ.50 వేల మార్క్ క్రాస్ చేసి ఆల్ టైం రికార్డు అందుకుంది. అయితే మళ్లీ ఆ స్థాయి నుంచి పతనమైంది. ఇదంతా గడిచిన నెల రోజుల వ్యవధిలో బంగారం ధరలు మళ్లీ పతనం బాట పట్టాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్ విజృంభించడంతో ప్రపంచ ఆర్థిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోని సొమ్మును మదుపరులు భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండి వైపు తరలిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కె ట్లో డిమాండ్ ఊపందుకుంది. తత్ఫలితంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర ఓ దశలో 2000 డాలర్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల రేట్లు ఎగబాకాయి. అయితే కరోనా వ్యాక్సిన్ సాధారణ ప్రజలకు ఇస్తున్న నేపథ్యంలో చమురు ధరలు సైతం భారీగా పెరుగుతున్నాయి. దీంతో సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారం నుంచి నెమ్మదిగా పెట్టుబడులు ఈక్విటీ వైపు సాగుతున్నాయి.
ఈక్విటీ మార్కెట్లలోని బుల్లిష్ ధోరణి కనబడుతోంది. భవిష్యత్తులో మాత్రం పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం మరింత ధర తగ్గుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశీయ బులియన్ మార్కెట్లపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1800 డాలర్లకు పతనమైంది. అటు దేశీయంగా సైతం బంగారం ధరలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఇప్పటికే దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గుతున్నాయి.

(ప్రతీకాత్మక చిత్రం)
బంగారం ధర భారీగా పడిపోయే చాన్స్
కరోనా వ్యాక్సిన్ వచ్చిన నేపథ్యంలో కరోనా ఎఫెక్ట్ నుంచి బయట పడిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు యూరప్ దేశాలు తమ పసిడి నిలువలను ప్రపంచ మార్కెట్ లో అమ్మకానికి పెట్టే అవకాశం ఉందని, అప్పుడు బంగారం ధరలు పతనమయ్యే చాన్స్ ఉందనే విశ్లేషణలు కూడా ఏర్పడుతున్నాయి.
గతంలో సైప్రస్ దేశం సంక్షోభంలో చిక్కుకొని దివాళా తీస్తే. ఆ సంక్షోభం నుంచి బయటపడడం కోసం సైప్రస్ తన దగ్గరున్న బంగారం నిల్వలను ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. దీంతో మార్కెట్లోకి బంగారం సరఫరా పెరగడంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. సైప్రస్ దేశాన్ని ఆపదలో ఆదుకున్నది బంగారమే అని గుర్తించాలి. అయతే ప్రస్తుతం ప్రపంచ దేశాల పరంగా చూస్తే అమెరికా వద్ద అత్యధికంగా 8000 టన్నులకు పైగా బంగారం నిల్వలతో మొదటి స్థానంలో ఉండగా, 4000 టన్నులతో జర్మనీ రెండో స్థానంలో ఉంది. ఇక ఇటలీ, ప్రాన్స్, రష్యా, చైనా 2 వేల టన్నుల చొప్పున బంగారం రిజర్వ్స్ కలిగి ఉన్నారు. కాగా టాప్ 5 బంగారం నిల్వలు ఉన్న దేశాలన్నీ ప్రస్తుతం కరోనా చేతికి చిక్కి విలవిల లాడుతున్నాయి. అయితే ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునేందుకు బంగారం నిల్వలను ఓపెన్ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే బంగారం విలువ రిటైల్ మార్కెట్లో తులం రూ. 25 వేలకు పతనం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని బులియన్ బండితులు విశ్లేషిస్తున్నారు.