పెరిగిన పసిడి ధరలు...లేటెస్ట్ ధరను చెక్ చేయండి

Gold Rates Today | స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితుల కారణంగా పసిడి ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

news18-telugu
Updated: January 25, 2019, 5:59 PM IST
పెరిగిన పసిడి ధరలు...లేటెస్ట్ ధరను చెక్ చేయండి
బంగారం ధరలు
  • Share this:
పెళ్లిళ్ల సీజన్ మొదలుకావడంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొస్తున్నాయి. బుల్లియన్ మార్కెట్లో శుక్రవారం పసిడి ధరలు మరింత పెరిగాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం రూ.90లు పెరిగి రూ.33,300గా ధర పలికింది. 99.5 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం కూడా రూ.90లు పెరిగి రూ.33,150గా ధర పలికింది. స్థానిక బంగారు ఆభరణాల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతో పాటు గ్లోబల్ మార్కెట్లో నెలకొన్న సానుకూల పరిస్థితుల కారణంగా పసిడి ధరలు పెరిగాయని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు. అటు వెండి ధర కేజీపై రూ.100 పెరిగి రూ.40,050కి చేరుకుంంది.

2018 బంగారానికి కలిసొచ్చిందా? ధర ఎంత పెరిగింది? | Is gold shined in 2018? How much price increased?
ప్రతీకాత్మక చిత్రం


అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్‌లో ఔన్స్ ధర 0.21 శాతం పెరిగి 1,284.30 డాలర్లుగా నమోదయ్యింది. రిపబ్లిక్ డే సందర్భంగా శనివారం బుల్లియన్ మార్కెట్‌కి సెలవుదినం.

First published: January 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>