Home /News /business /

GOLD RATES TODAY SILVER RATES TODAY GOLD AND SILVER PRICES HIKED ONCE AGAIN HERE IS LATEST PRICES IN HYDERABAD VIAYAWADA VISAKHAPATNAM SK

Gold Rates: పండగ సీజన్‌లో పైపైకి పసిడి.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తాజా రేట్ల వివరాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold and Silver Price today: పండగ సీజన్‌లో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. గత కొన్ని రోజులుగా పసిడి రేటు పైపైకి ఎగబాకుతోంది. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు సైతం స్పల్పంగా పెరిగాయి. మరి హైదరాబాద్‌, విశాఖపట్టణం, విజయవాడ సహా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.

ఇంకా చదవండి ...
    బులియన్ మార్కెట్లో (Bullion Market) బంగారం (Gold) దూకుడు కొనసాగుతోంది. పెరగడమే తప్ప తగ్గడం తెలియదన్నట్లుగా దూసుకెళ్తోంది. పండగలతో పాటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారానికి డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే పసిడి ధరలు (Gold Rates) పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. వెండి  (Silver Price)సైతం అదేబాటలో వెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌ (Hyderabad), విశాఖపట్టణం (Visakhapatnam), విజయవాడ (Vijayawada) సహా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,800గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.100 పెరిగింది. అదే ఒక్క గ్రాము కావాలంటే 4,480కి లభిస్తోంది. ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల  బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల  స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.48,870 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.110 పెరిగింది. స్వచ్ఛమైన బంగారం ఒక్క గ్రాము ధర రూ.4,887గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి.

    Reducing Cooking Oil Prices: గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనెల ధరలు..

    దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు:

    చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,150గా ఉంది. ఇక ముంబైలో రూ.47,070,  న్యూఢిల్లీలో 46,959, బెంగళూరులో రూ.44,800, కేరళలో 44,800, అహ్మదాబాద్‌లో 45,580, జైపూర్‌లో 47,010గా ఉన్నాయి.

    దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు:

    చెన్నైలో 49,260, ముంబైలో 48,070, ఢిల్లీలో రూ.51,220, కోల్‌కతాలో రూ.49,950, బెంగళూరులో రూ.48,870 కేరళలో 48,870, అహ్మదాబాద్‌లో 49,720, జైపూర్‌లో 49,260గా ఉన్నాయి.

    అక్టోబరు 7 నుంచి బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. గత 10 రోజుల్లో బంగారం ధరలు ఐదు సార్లు పెరిగాయి. ఒకే ఒక్కసారి తగ్గాయి. సార్లు స్థిరంగా ఉన్నాయి.

    Gold Investments: పండుగ సీజన్‌లో బంగారం ఏ రూపంలో కొనాలి?.. ఏది బెస్ట్

    హైదరాబాద్‌లో వెండి ధరలు:

    హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.67,700 పలుకుతోంది. 10 గ్రాముల ధర రూ.677గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల వెండి ధర రూ.11 పెరిగింది. ప్రసుతం ఒక్క గ్రాము వెండి 67.70కి దొరుకుతోంది.

    దేశవ్యాప్తంగా వెండి ధరలు

    చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.677గా ఉంది. కేరళ, హైదరాబాద్, మధురైలో కూడా ఇదే రేటుకు వెండి లభిస్తోంది. ఇక ముంబై న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు,పుణె, అహ్మదాబాద్, జైపూర్‌లో రూ.636కు అందుబాటులో ఉంది. వెండి ధరలు గత పది రోజుల్లో ఐదుసార్లు సార్లు పెరిగాయి. ఒకే ఒక్కసారి తగ్గాయి. నాలుగు రోజులు స్థిరంగా ఉన్నాయి.

    4 రోజుల్లోనే ఆ రెండు కంపెనీల షేర్లతో రూ.1331 కోట్లు సంపాదించిన ఘనుడు..ఎవరో తెలుసా?

    బంగారం, వెండి ధరలు ఎప్పుడు ఒకేలా ఉండవు.  ప్రతి రోజూ మారుతుంటాయి. ఇవాళ ఉన్న ధరలు రేపు ఉండదు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం  వంటి కారణాలతో పసడి ధరల్లో హెచ్చుతగ్గులు  కనిపిస్తాయి.  ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం ధరల్లో నిత్యం హెచ్చుతగ్గులు ఉంటాయి. అందుకే కొన్ని రోజులగా బంగారం ధరలను విశ్లేషిస్తూ, ధరలు పతనమవుతున్న సమయంలో కొంటే బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Gold, Gold bars, Gold rate, Silver, Silver price

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు