Gold Rates: మహిళలకు గుడ్‌న్యూస్..10 రోజుల తర్వాత తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే?

ప్రతీకాత్మక చిత్రం

Gold and Silver Rates: 10 రోజుల తర్వాత పసిడి రేటు కాస్త తగ్గింది. నిన్నటితో పోల్చితే స్వల్పంగా పడిపోయింది. ఇక వెండి ధర కూడా నాలుగు రోజుల తర్వాత స్వల్పంగా తగ్గింది. మరి బంగారం, వెండి ధరలు ఎంత మేర తగ్గాయి? నగలు కొనేందుకు ఇది సరైన సమయమా?

  • Share this:
    మహిళలకు శుభవార్త. పెరగడమే తప్ప తగ్గడమే తెలియని బంగారం రేటు (Gold Price) ఎట్టకేలకు దిగొచ్చింది. 10 రోజుల తర్వాత పసిడి రేటు కాస్త తగ్గింది. నిన్నటితో పోల్చితే స్వల్పంగా పడిపోయింది. ఇక వెండి ధర (Silver Price)కూడా నాలుగు రోజుల తర్వాత స్వల్పంగా తగ్గింది. మరి బంగారం, వెండి ధరలు ఎంత మేర తగ్గాయి? నగలు కొనేందుకు ఇది సరైన సమయమా? తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌ (Hyderabad), విశాఖపట్టణం (Visakhapatnam), విజయవాడ (Vijayawada) సహా దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

    శనివారం సాయంత్రం బంగారం ధరలు బాగానే తగ్గాయి. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,200గా ఉంది. నిన్నటితో పోల్చితే రూ.600 తగ్గింది. అదే ఒక్క గ్రాము కావాలంటే 4,420కి లభిస్తోంది. ఇక పెట్టుబడుల్లో వాడే 24 క్యారెట్ల బంగారం విషయానికొస్తే.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.48,220 పలుకుతోంది. నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.650 తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ఒక్క గ్రాము ధర రూ.4,822గా ఉంది. హైదరాబాద్‌తో పాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడలో ధరలు ఒకే విధంగా ఉన్నాయి. మిగతా నగరాల్లో మాత్రం కాస్త అటూ ఇటూగా ఉన్నాయి

    SIP calculator: నెల నెల ఈ ఒక్క పనిచేస్తే రూ.5 కోట్ల భారీ మొత్తం మీ సొంతం..ఎలాగంటే...

    దేశవ్యాప్తంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు:

    చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,650 పలుకుతోంది. ముంబైలో రూ.47,070, న్యూఢిల్లీలో 46,350, బెంగళూరులో రూ.44,200, కేరళలో 42,800, అహ్మదాబాద్‌లో 45,980, జైపూర్‌లో 46,400, లక్నోలో 45,200గా ఉంది.

    దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరల వివరాలు:

    చెన్నైలో 48,710, ముంబైలో 48,070, ఢిల్లీలో రూ.50,560, కోల్‌కతాలో రూ.49,450, బెంగళూరులో రూ.48,220 కేరళలో 48,220, అహ్మదాబాద్‌లో 50,160, జైపూర్‌లో 48,620గా ఉన్నాయి.

    స్వయంశక్తితో వేలకోట్లు సంపాదించిన యువ వ్యాపారవేత్తలు వీరే.. హురుస్ ఇండియా జాబితా

    అక్టోబరు 7 నుంచి బంగారం ధరలు పెరగడమే తప్ప తగ్గడం లేదు. కానీ ఎట్టకేలకు 10 రోజుల తర్వాత తగ్గాయి. గత 10 రోజుల్లో బంగారం ధరలు ఐదు సార్లు పెరిగాయి. ఒకే ఒక్కసారి తగ్గాయి. నాలుగు సార్లు స్థిరంగా ఉన్నాయి. అంటే ఎప్పుడో ఒకసారి మాత్రమే బంగారం ధరలు తగ్గుతున్నాయి. మిగతా రోజుల్లో మాత్రం పెరుగుతున్నాయి.

    హైదరాబాద్‌లో వెండి ధరలు:

    వెండి ధర కూడా స్వల్పంగా దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి రూ.67,400 పలుకుతోంది. 10 గ్రాముల ధర రూ.674గా ఉంది. నిన్నటితో పోల్చితే 10 గ్రాముల వెండి ధర రూ.3 తగ్గింది. ప్రసుతం ఒక్క గ్రాము వెండి రూ.67.40కి దొరుకుతోంది.

    దేశవ్యాప్తంగా వెండి ధరలు

    చెన్నైలో 10 గ్రాముల వెండి ధర రూ.674గా ఉంది. కేరళ, హైదరాబాద్, మధురైలో కూడా ఇదే రేటుకు వెండి లభిస్తోంది. ఇక ముంబై న్యూఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు,పుణె, అహ్మదాబాద్, జైపూర్‌లో రూ.636కు అందుబాటులో ఉంది. వెండి ధరలు గత పది రోజుల్లో నాలుగు సార్లు పెరిగాయి. మరో నాలుగు రోజులు స్థిరంగా ఉన్నాయి. రెండు సార్లు మాత్రం స్వల్పంగా తగ్గాయి.

    Paytm: గుడ్ న్యూస్... ఇక పేటీఎంలో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ దాచుకోవచ్చు

    బంగారం, వెండి ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గడం, ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. అందుకే బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. బంగారం ధరలను ఎప్పటికప్పుడూ విశ్లేషిస్తూ ఉండాలి. ఇక తగ్గుతాయి అని అంచనాకు వచ్చిన తర్వాత నగలను కొనాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: