Gold Rates Today: మరింత తగ్గిన పసిడి ధరలు...కారణాలు ఇవే..

Gold Rates Today | బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 12.5శాతానికి పెంచడంతో శుక్రవారం రికార్డు గరిష్ఠ స్థాయిని తాకిన బంగారం ధరలు...క్రమంగా దిగివస్తున్నాయి.

news18-telugu
Updated: July 10, 2019, 4:57 PM IST
Gold Rates Today: మరింత తగ్గిన పసిడి ధరలు...కారణాలు ఇవే..
(ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: July 10, 2019, 4:57 PM IST
మూడ్రోజుల క్రితం రికార్డు గరిష్ఠ స్థాయికి చేరిన పసిడి ధరలు క్రమంగా దిగువస్తున్నాయి. డిమాండ్ తగ్గడంతో వరుసగా మూడో రోజు బుధవారం కూడా పసిడి ధరలు తగ్గాయి. ఆగస్టు మాసానికి సంబంధించిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఫ్యూచర్ కాంట్రాక్టులో 0.5 శాతం(రూ.89) తగ్గి రూ.34,397గా నమోదయ్యింది. బంగారంపై దిగుమతి సుంఖాలు పెంచనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో శుక్రవారం రోజున ఫ్యూచర్ కాంట్రాక్టులో బంగారం ధర రికార్డు గరిష్ఠ స్థాయిలో రూ.35,100గా నమోదయ్యింది. ఢిల్లీ మార్కెట్లో మంగళవారంనాడు 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ.600 తగ్గి రూ.34,700గా నమోదుకాగా...24 క్యారెట్ల బంగారం రూ.600 తగ్గి రూ.34,700గా నమోదయ్యింది.

అమెరికా డాలర్ విలువ పుంజుకోవడంతో బంగారం ధరలు తగ్గగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగివస్తున్నాయి. డాలర్ విలువ పుంజుకోవడంతో  అంతర్జాతీయ మార్కెట్లో పసిడికి డిమాండ్ తక్కువగా ఉంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం 0.4 శాతం తగ్గిన ఔన్స్ బంగారం 1,392.50 డాలర్లుగా నమోదయ్యింది. ఆ మేరకు దేశీయ మార్కెట్లోనూ బంగారం ధరలు తగ్గుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...