GOLD RATES TODAY EDGED HIGHER CONTINUING THE DOWN MOVEMENT IN THE PAST FEW WEEKS MK
Gold price today: భారీగా తగ్గుతున్న బంగారం ధరలు...కొనేందుకు ఇదే సరైన సమయమా..?
ప్రతీకాత్మకచిత్రం
గత నెలలో తులం బంగారం(24 కేరట్లు) ధర రూ.40 వేలు తాకగా, ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో తులం బంగారం ధర ( 24 కేరట్లు) రూ.39,030 గా పలికింది. అటు హైదరాబాద్ మార్కెట్లో రూ.39,551గా పలికింది. అలాగే ముంబై మార్కెట్లో రూ.39,512గా పలికింది. అలాగే కిలో వెండిధర రూ.45,427గా పలుకుతోంది.
బంగారం ధరలు ప్రపంచ వ్యాప్తంగా భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తగ్గుముఖం పట్టి చర్చలు ప్రారంభించడంతో పాటు, రూపీ కాస్త బలపడటం బంగారం ధరలు తగ్గేందుకు దోహదం చేశాయి. ముఖ్యంగా గడిచిన నెల రోజుల వ్యవధిలో న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర ఏకంగా 60 డాలర్ల మేర తగ్గింది. గత నెలలో బంగారం ధర గరిష్టంగా 1530 డాలర్ల వరకూ పెరిగింది. అక్కడి నుంచి పతనమైన బంగారం ధర ప్రస్తుతం 1475 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదిలాఉంటే అటు దేశీయంగా రిటైల్ మార్కెట్లో కూడా బంగారం తగ్గుముఖం పడుతోంది. స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు నేడు (బుధవారం) స్వల్పంగా పెరిగినప్పటికీ భవిష్యత్తులో మాత్రం భారీగా తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత నెలలో తులం బంగారం(24 కేరట్లు) ధర రూ.40 వేలు తాకగా, ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో తులం బంగారం ధర ( 24 కేరట్లు) రూ.39,030 గా పలికింది. అటు హైదరాబాద్ మార్కెట్లో రూ.39,551గా పలికింది. అలాగే ముంబై మార్కెట్లో రూ.39,512గా పలికింది. అలాగే కిలో వెండిధర రూ.45,427గా పలుకుతోంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.