Gold Price Today | బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే పసిడి రేటు మెరిసిపోతోంది. బంగారం ధగధగమంటోంది. ఈ వారంలో కూడా బంగారం ధరలు (Gold Price) పైకి కదిలాయి. దీంతో పసిడి (Gold) ప్రేమికులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. బంగారం ధరలు ఈ వారంలో ఎంత మేర పెరిగాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
హైదరాబాద్ మార్కెట్‌లో ఈ వారంలో బంగారం ధరలు భగభగ మంటున్నాయి. వారం ఆరంభంలో రూ. 57,060 వద్ద ఉన్న పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ. 57,440కు చేరాయి. అంటే పసిడి రేటు రూ. 380 మేర పరుగులు పెట్టిందని చెప్పుకోవచ్చు. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు రూ. 52,250 నుంచి రూ. 52,650కు చేరింది. అంటే ఈ పసిడి రేటు దాదాపు రూ. 400 పెరిగిందని చెప్పుకోవచ్చు.
ఎస్‌బీఐ కొత్త ఆఫర్ అదిరింది.. లోన్ తీసుకునే వారికి సూపర్ బెనిఫిట్స్!
అదేసమయంలో వెండి ధరల విషయానికి వస్తే.. సిల్వర్ రేటు స్వల్పంగా తగ్గింది. రూ. 100 క్షీణించింది. వారం ఆరంభంలో వెండి ధర కేజీకి రూ. 74,300 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు వెండి ధర రూ. 74,200 వద్ద ఉంది. అంటే స్వల్పంగా తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే బంగారం ధర పైకి చేరితే.. వెండి ధర మాత్రం కిందకు దిగి వచ్చిందని చెప్పుకోవచ్చు.
బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక.. ఈ నెంబర్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేయండి.. లేదంటే..
కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను (జీఎస్‌ట) అదనం అని గుర్తించుకోవాలి. ఇంకా తయారీ చార్జీలు కూడా ఉంటాయి. వీటిని కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా చాలా అధిక స్థాయిలో ఉంటాయని చెప్పుకోవచ్చు. అందువల్ల జువెలరీ సంస్థల్లో బంగారం ధరలు కొంత మేర వ్యత్యాసంతో ఉంటాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 1928 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర ఔన్స్‌కు 23.7 డాలర్ల వద్ద ఉంది.
ఇకపోతే రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలు ఇంకా పైకి చేరొచ్చనే అంచనాలు ఉన్నాయి. పసిడి రేటు ఏకంగా రూ. 62 వేలకు పైకి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక వెండి ధర కేజీకి రూ. 80 వేలకు చేరొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే బంగారం, వెండి కొనే వారికిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక మాంద్యం భయాలు ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold, Gold price, Gold price in hyderabad, Gold Price Today, Gold rate, Gold rate hyderabad, Gold Rate Today