బంగారం ధరలు మరింతగా పెరిగాయి. 99.9 శాతం స్వచ్ఛత ఉన్న తులం(10గ్రాములు) బంగారం ధర రూ.485 పెరిగి బుధవారం నాటికి ఢిల్లీ మార్కెట్లో రూ.41,810కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.855 పెరిగి రూ.48,675 నుంచి రూ.49,530కి చేరుకుంది. ఈ పెరుగుదలకు రూపాయి బలహీనపడటమే కారణంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,584 డాలర్లు, వెండి ధర 18.43 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నాయి.
భౌగోళిక రాజకీయ పరిస్థితులు అనిశ్చితంగా, ఆందోళనకంగా మారాయని, దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర అధికంగా పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.42021.39గా, వెండి ధర రూ.52100గా ఉంది.
Published by:Shravan Kumar Bommakanti
First published:January 09, 2020, 09:05 IST