Gold Price Today | బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి షాక్. ఎందుకంటే పసిడి రేటు (Gold Prices) పరుగులు పెడుతోంది. బంగారం ధర ఈ వారంలో భారీగా పెరిగింది. బంగారు ఆభరణాలు (Gold Jewellery) కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ప్రతికూల అంశం అని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rates) ర్యాలీ చేయడంతో ఆ ప్రభావం దేశీ మార్కెట్‌పై కూడా పడిందని నిపుణులు పేర్కొంటున్నారు.
బంగారం ధర ఈ వారంలో భారీగా పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో చూస్తే.. 24 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1500 వరకు పెరిగింది. వారం ఆరంభంలో రూ. 51,160 వద్ద ఉన్న పసిడి రేటు ఇప్పుడు ఏకంగా రూ. 52,640 స్థాయికి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారాన్ని గమనిస్తే.. ఈ పసిడి రేటు పది గ్రాములకు ఈ వారం రోజుల్లో రూ. 46,900 నుంచి రూ. 48,260 స్థాయికి చేరింది. అంటే దాదాపు రూ. 1400 వరకు పెరిగిందని చెప్పుకోవచ్చు.
వావ్.. 1 లీటరుకు 40 కిలోమీటర్ల మైలేజ్.. మార్కెట్లోకి రానున్న కొత్త కార్లు ఇవే!
ఇక వెండి రేటు విషయానికి వస్తే.. సిల్వర్ రేటు కూడా పరుగులు పెట్టింది. వెండి ధర కేజీకి రూ. 1200 పైకి చేరింది. ఈ వారం ఆరంభంలో కేజీ వెండి రేటు రూ. 66,300 వద్ద ఉండేది. అయితే ఇప్పుడు వెండి ధర రూ. 67,500కు చేరింది. అంటే బంగారం, వెండి ధరలు రెండూ పైకి చేరాయి. ఇకపోతే ఏపీలోని విజయవాడ , విశాఖ పట్నంలో కూడా దాదాపు ఇవే రేట్లు ఉంటాయి.
ఫోన్‌పే వాడే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇక ఆధార్ కార్డు ఉంటే చాలు
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు ర్యాలీ చేశాయి. భారీగా పెరిగాయి. పసిడి రేటు ఏకంగా ఔన్స్‌కు 1774 డాలర్ల స్థాయికి చేరింది. ఇదివరకు పసిడి రేటు 1700 డాలర్ల దిగువున ఉండేది. అంటే బంగారం ధర ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో దేశీ మార్కెట్లో కూడా పసిడి ర్యాలీ చేసింది. అమెరికా డాలర్ తగ్గడంతో బంగారం ధరకు రెక్కలు వచ్చాయని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం తగ్గడంతో డాలర్ ర్యాలీకి అడ్డుకట్ట పడింది. ఈ క్రమంలో రానున్న కాలంలో కూడా పసిడి రేటు ర్యాలీ చేయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాగా పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలకు జీఎస్టీని కలుపలేదు. అలాగే జువెలరీ తయారీ చార్జీలు, జువెలర్స్ ప్రాఫిట్ మార్జిన్ వంటివి కూడా అదనం. అందువల్ల బంగారం ధరల్లో కొంత మేర వ్యత్యాసం ఉండొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold price, Gold rate, Gold rate hyderabad, Silver price, Silver rate