Gold Rates | మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Gold Price (ప్రతీకాత్మక చిత్రం)

Gold Rates | ఆర్థికంగా, వాణిజ్యపరంగా రాబోయేది సంక్షోభ కాలమే అనే అంచనాలతో ఉన్న మదుపర్లు... సురక్షిత సాధనంగా పసిడినే నమ్ముతున్నారు. అందుకే పుత్తడి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి.

  • Share this:
    కరోనా ఎఫెక్ట్‌తో ప్రపంచ మార్కెట్లన్నీ నేల చూపులు చూస్తున్నాయి. దీంతో తమ పెట్టుబడికి బంగారమే సేఫ్ అని భావిస్తున్నారు ఇన్వెస్టర్లు. కొద్దిరోజుల క్రితం ఆల్ టైమ్ హైకి చేరుకుని మళ్లీ కొద్దిగా దిగొచ్చిన పసిడి ధరలు మళ్లీ పైపైకి దూసుకుపోతున్నాయి. తాజాగా మరోసారి స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతుండటంతో బంగారం ధరలు ఎగబాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో మదుపుదారులు షేర్లను అమ్మి బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఆర్థికంగా, వాణిజ్యపరంగా రాబోయేది సంక్షోభ కాలమే అనే అంచనాలతో ఉన్న మదుపర్లు... సురక్షిత సాధనంగా పసిడినే నమ్ముతున్నారు.

    అందుకే పుత్తడి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ. 530 పెరిగి రూ 43,770కి చేరింది. మరోవైపు వెండి కూడా బంగారంతో పోటీ పడుతోంది. రూ 1348 పెరిగిన వెండి కిలో ధర ఏకంగా రూ 41, 222కి ఎగబాకింది. రాబోయే రోజుల్లో బంగారం ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. త్వరలోనే పది గ్రాముల పుత్తడి... రూ 45,000 మార్కు దాటవచ్చని భావిస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: