హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price Today: పండుగ సీజన్ ముంగిట.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు!

Gold Price Today: పండుగ సీజన్ ముంగిట.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు!

 Gold Price Today: బంగారం కొనే వారికి పండగే.. భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు!

Gold Price Today: బంగారం కొనే వారికి పండగే.. భారీగా పడిపోయిన గోల్డ్, సిల్వర్ రేట్లు!

Gold Rate Today | బంగారం ధరలు తగ్గుతూనే ఉన్నాయి. వరుసగా మూడు రోజులుగా పసిడి రేటు నేలచూపులు చూస్తూనే ఉంది. బంగారం కొనాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Gold Rate Today | పండుగ సీజన్ ముందు బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం. పసిడి ధరలు (Gold Rates) పడిపోతూనే వస్తున్నాయి. బంగారం ధర (Gold Prices) గత మూడు రోజులుగా తగ్గుతూనే వచ్చింది. పుత్తడి బాటలోనే వెండి కూడా నడిచింది. గోల్డ్, సిల్వర్ జువెలరీ కొనాలని భావించే వారికి ఇది తీపికబురు అని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో దేశీ మార్కెట్‌లోనూ అదే ట్రెండ్ కొనసాగుతోంది.

    హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతూనే వస్తున్నాయి. వరుసగా మూడు రోజులుగా పసిడి రేట్లు నేలచూపులు చూస్తూనే ఉంది. మూడు రోజుల కాలంలో బంగారం ధర రూ. 600 మేర పతనమైంది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారానికి ఇది వర్తిస్తుంది. దీంతో ఈ పసిడి రేటు ఇప్పుడు రూ. 50,400 వద్ద ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే.. ఈ పసిడి రేటు పది గ్రాములకు రూ. 550 మేర పడిపోయింది. రూ. 46,200కు దిగి వచ్చింది.

    రూ.9,999 ఫోన్ రూ.539కే అందుబాటులో! ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ డీల్!

    బంగారం ధరలు తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. సిల్వర్ రేటు కూడా వెలవెలబోయింది. వెండి రేటు వరుసగా గత రెండు రోజులుగా పడుతూనే వస్తోంది. సిల్వర్ రేటు ఈ రెండు రోజుల్లో రూ. 1300 మేర క్షీణించింది. దీంతో వెండి రేటు కేజీకి రూ. 61,100 వద్ద ఉంది. వెండి కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.

    థ్రిల్లింగ్ ఆఫర్.. రూ.2,000కే టీవీ కొనొచ్చు.. పూర్తి వివరాలు!

    అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. అమెరికా ద్రవ్యోల్బణం అంచనాలు మించి నమోదు కావడంతో పసిడి రేటుపై ప్రతికూల ప్రభావం పడింది. అమెరికా డాలర్ పుంజుకోవడం వల్ల పసిడిపై ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. బంగారం ధర ఔన్స్‌కు 0.24 శాతం మేర పడిపోయింది. 1673 డాలర్లకు దిగి వచ్చింది. సిల్వర్ రేటు కూడా పతనమైంది. 1.11 శాతం పడిపోయింది. 19 డాలర్లకు క్షీణించింది.

    గ్లోబల్ మార్కెట్‌లో పసిడి రేటు పడిపోవడంతో అదే ట్రెండ్ మన దేశంలోనూ కనిపిస్తోంది. ఇకపోతే వచ్చే వారంలో అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశం ఉంది. ఇందులో ఫెడ్ రేటు పెరిగే అవకాశం ఉంది. దీని వల్ల బంగారం ధరలపై మరింత ప్రభావం పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల బంగారం కొనాలని చూసే వారు ఒక వారం రోజులు వేచి చూడటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. అటుపైన ట్రెండ్ ఆధారంగా కొంటే సరిపోతుంది.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: Gold, Gold price, Gold Price Today, Gold rate, Gold Rate Today, Silver price

    ఉత్తమ కథలు