తగ్గిన బంగారం, వెండి ధరలు
అక్షయతృతీయ రోజున బంగారం ధరలు దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులు కాసింత బంగారాన్ని కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో నగల షాపులకు క్యూలు కట్టారు. దీంతో.. దేశంలోని అన్ని గోల్డ్ షాపులు వినియోగదారులతో కిటకిటలాడాయి. దేశరాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ. 50 తగ్గింది.. దీంతో నిన్న ఉన్న బంగారం ధర రూ.32,720 నుంచి.. ఒక్కసారిగా రూ.32,670కి చేరింది. ఇక న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం రూ.1282.2 డాలర్లు ఉండగా.. వెండి రూ. 14.92 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ఢిల్లీ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.32,670 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం.. రూ.32,500గా ఉంది. తెలుగురాష్ట్రాల్లో ఈ ధరలు 24 క్యారెట్ల బంగారానికి రూ.32,920గా ఉండగా.. 22క్యారెట్ల బంగారం రూ.30,220 గా ఉంది.
మరోవైపు బంగారం ధరల బాటలోనే వెండి ధరలు ప్రయాణించాయి.. కిలో వెండి ధర రూ.38,120 వద్ద కొనసాగుతోంది. 100 వెండి నాణేలు.. రూ.79,000లకు లభించగా.. అమ్మకం ధర రూ. 80,000లుగా ఉంది..
(గమనిక : బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి గమనించగలరు..)
First published:
May 7, 2019, 6:35 PM IST