
ప్రతీకాత్మక చిత్రం
Gold Rates : ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సెప్టెంబరులో రూ.40 వేలకు చేరిన బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలల కాలంలో దాదాపు రూ.2వేలు తగ్గాయి.
ఆకాశాన్ని అంటిన బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సెప్టెంబరులో రూ.40 వేలకు చేరిన బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలల కాలంలో దాదాపు రూ.2వేలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకోవడంతో పసిడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,450 వద్ద, అదే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.38,983.96 వద్ద కొనసాగుతోంది. రాబోయే కాలంలో ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జనవరి నాటికి ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అమెరికా-చైనా వాణిజ్య ఒప్పందం కారణంగా బంగారం దిగి వస్తోందని వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతానికి ధరలు తగ్గినా భారత్లో ఈ ఏడాది బంగారం ధర 20 శాతం పెరిగింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:November 18, 2019, 06:27 IST