హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold: తులం బంగారం రూ.30 వేలు...అసలు సంగతి తెలిస్తే...పండగ చేసుకుంటారు...

Gold: తులం బంగారం రూ.30 వేలు...అసలు సంగతి తెలిస్తే...పండగ చేసుకుంటారు...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

టాప్ 5 బంగారం నిల్వలు ఉన్న దేశాలన్నీ ప్రస్తుతం కరోనా చేతికి చిక్కి విలవిల లాడుతున్నాయి. ఆ దేశాలు బంగారం నిల్వలను ఓపెన్ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే బంగారం విలువ రిటైల్ మార్కెట్లో తులం 25 వేలకు పతనం అవ్వడం ఖాయం.

Gold Rate in Hyderabad : బంగారం ధరల్లో సందిగ్ధత నెలకొంది. అయితే ఓ వారం భారీగా పెరిగితే, మరో వారం భారీగా పతనం అవుతున్నాయి. దీంతో పసిడి బాట ఎటువైపు అనేది బులియన్ పండితులకు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. (gold rate in hyderabad today) ఇప్పటికే రూ.50 వేల మార్క్ క్రాస్ చేసి ఆల్ టైం రికార్డు అందుకుంది. అయితే మళ్లీ ఆ స్థాయి నుంచి పతనమైంది. ఇదంతా గడిచిన నెల రోజుల వ్యవధిలో చోటుచేసుకుంది. ఓ దశలో పసిడి ధరలు ఆల్‌టైం రికార్డుల మోత మోగిస్తూ ఆల్ టైం రికార్డు స్థాయిని తాకింది. ఇదిలా ఉంటే కరోనా వైరస్‌ విజృంభించడంతో ప్రపంచ ఆర్థిక ప్రగతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలోని సొమ్మును మదుపరులు భద్రమైన పెట్టుబడి సాధనమైన బంగారం, వెండి వైపు తరలిస్తున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కె ట్లో డిమాండ్‌ ఊపందుకుంది. తత్ఫలితంగా ఔన్సు (31.10 గ్రాములు) బంగారం ధర మరోసారి 1,800 డాలర్ల ఎగువకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయంగానూ విలువైన లోహాల రేట్లు ఎగబాకాయి. కరోనా దెబ్బ ఇంకా ఎన్నాళ్లు సాగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు చమురు ధరలు సైతం భారీగా పతనమవుతున్నాయి. ఇప్పటికే బ్యారెల్ క్రూడాయిల్ ధర 40 డాలర్ల వద్ద కొనసాగుతోంది. దీంతో అందరి కన్ను సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారంపై పడింది.

Muthoot Finance Loan at Home, Muthoot Finance gold loan, how to apply for gold loan, Muthoot Finance gold loan interest rates, gold loan in india, బంగారం రుణాలు, ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్, ముత్తూట్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు, ముత్తూట్ ఫైనాన్స్ లోన్ ఎట్ హోమ్, గోల్డ్ లోన్‌కు ఎలా అప్లై చేయాలి
(ప్రతీకాత్మక చిత్రం)

ముఖ్యంగా ఇన్వెస్టర్లు కరోనా వైరస్ భయాలతో ఉత్పత్తి మందగించిందని, అంచనాకు వస్తున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలు 2 నుంచి 4.1 లక్షల కోట్ల డాలర్ల (ట్రిలియన్‌) దాకా నష్టపోవచ్చని ఏడీబీ పేర్కొంది. గ్లోబల్‌ జీడీపీలో ఇది 2.3–4.8 శాతానికి సమానంగా ఉంటుందని వివరించింది. వర్ధమాన ఆసియా దేశాలు కరోనా వైరస్‌ వల్ల అత్యధికంగా నష్టపోనున్నాయని తెలిపింది. దీంతో ఇప్పటికే ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.

ఈక్విటీ మార్కెట్లలోని బేరిష్ ట్రెండ్ అటు బంగారానికి మాత్రం బుల్లిష్ ధోరణిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అంత తొందరగా బంగారం వైపు మదుపరులు తమ పెట్టుబడులు తరలించకపోయినప్పటికీ, భవిష్యత్తులో మాత్రం పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం మరింత ధర పెరుగుతుందనే వార్తలు వస్తున్నాయి.

china gold scam, china gold fradu, gold scam in china, china gold reserves, fake gold, copper gold, చైనా గోల్డ్ స్కాం, బంగారం తనఖా స్కాం, కింగ్ గోల్డ్ కంపెనీ, చైనా రియల్ ఎస్టేట్ బిజినెస్,
ప్రతీకాత్మకచిత్రం

ఈ నేపథ్యంలో మన దేశీయ బులియన్ మార్కెట్లపై దీని ప్రభావం ప్రత్యక్షంగా పడే అవకాశం ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో ఔన్సు బంగారం ధర 1800 డాలర్లు తాకింది. గత సంవత్సరం డిసెంబర్ 16న ఔన్సు బంగారం ధర 1472 డాలర్లు ఉండగా. ప్రస్తుతం 1800 డాలర్లకు ఎగిసింది. అంటే ఏకంగా 330 డాలర్లు పెరిగింది. ఫలితంగా అటు దేశీయంగా సైతం బంగారం ధరలు ప్రభావితం అవుతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరలు ఇప్పటికే దేశీయంగా 24 కేరట్ల ధర 50 వేల పై చిలుకే పలుకుతుండగా, ఔన్సు బంగారం 2,000 డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం సిటీ గ్రూప్‌ అంచనా వేసింది.

Sovereign Gold Bond issue date, Sovereign Gold Bond returns, Sovereign Gold Bond subscription, Sovereign Gold Bond benefits, how to buy Sovereign Gold Bond, సావరిన్ గోల్డ్ బాండ్ లాభాలు, సావరిన్ గోల్డ్ బాండ్ సబ్‌స్క్రిప్షన్, సావరిన్ గోల్డ్ బాండ్ రిటర్న్స్, సావరిన్ గోల్డ్ బాండ్ ఎలా కొనాలి, సావరిన్ గోల్డ్ బాండ్ ఇష్యూ ధర, సావరిన్ గోల్డ్ బాండ్ 2020
(ప్రతీకాత్మక చిత్రం)

బంగారం ధర భారీగా పడిపోయే చాన్స్

మరోవైపు కరోనా ఎఫెక్ట్ నుంచి బయట పడిన తర్వాత అభివృద్ధి చెందిన దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ సహా పలు యూరప్ దేశాలు తమ పసిడి నిలువలను ప్రపంచ మార్కెట్ లో అమ్మకానికి పెట్టే అవకాశం ఉందని, అప్పుడు బంగారం ధరలు పతనమయ్యే చాన్స్ ఉందనే విశ్లేషణలు కూడా ఏర్పడుతున్నాయి. స

గతంలో సైప్రస్ దేశం సంక్షోభంలో చిక్కుకొని దివాళా తీస్తే. ఆ సంక్షోభం నుంచి బయటపడడం కోసం సైప్రస్ తన దగ్గరున్న బంగారం నిల్వలను ఓపెన్ మార్కెట్లో విక్రయించింది. దీంతో మార్కెట్‌లోకి బంగారం సరఫరా పెరగడంతో ధర ఒక్కసారిగా పడిపోయింది. సైప్రస్ దేశాన్ని ఆపదలో ఆదుకున్నది బంగారమే అని గుర్తించాలి. అయతే ప్రస్తుతం ప్రపంచ దేశాల పరంగా చూస్తే అమెరికా వద్ద అత్యధికంగా 8000 టన్నులకు పైగా బంగారం నిల్వలతో మొదటి స్థానంలో ఉండగా, 4000 టన్నులతో జర్మనీ రెండో స్థానంలో ఉంది. ఇక ఇటలీ, ప్రాన్స్, రష్యా, చైనా 2 వేల టన్నుల చొప్పున బంగారం రిజర్వ్స్ కలిగి ఉన్నారు. కాగా టాప్ 5 బంగారం నిల్వలు ఉన్న దేశాలన్నీ ప్రస్తుతం కరోనా చేతికి చిక్కి విలవిల లాడుతున్నాయి. అయితే ఆయా దేశాలు తమ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునేందుకు బంగారం నిల్వలను ఓపెన్ మార్కెట్లో అమ్మే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే బంగారం విలువ రిటైల్ మార్కెట్లో తులం రూ. 25 వేలకు పతనం అయినా ఆశ్చర్యపోనవసరం లేదని బులియన్ బండితులు విశ్లేషిస్తున్నారు.

First published:

Tags: Business, Gold, Gold price down, Gold rate hyderabad

ఉత్తమ కథలు