Gold rate: ఆకాశ వీధిలో బంగారం ధరలు...రూ.40 వేలకు అటుఇటుగా ఊగిసలాట...

శుక్రవారం పసిడి స్వల్పంగా తగ్గి, రూ.40 వేలకు అటు ఇటుగా ధరలు ఊగిసలాడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.39,820 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ముంబైలో రూ.39860 వద్ద ట్రేడవుతోంది.

news18-telugu
Updated: August 30, 2019, 4:04 PM IST
Gold rate: ఆకాశ వీధిలో బంగారం ధరలు...రూ.40 వేలకు అటుఇటుగా ఊగిసలాట...
గత నెలలో రూ. 40,000 ఉండగా ఇప్పుడు రికార్డు స్థాయిలో ధరలు క్షీణించాయి.
  • Share this:
అంతర్జాతీయ మాంద్యం దెబ్బకు బంగారం ధరలు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాయి. తాజాగా బంగారం ధర దేశీయంగా 10 గ్రాములు (24 కేరట్లు) ధర రూ.40 వేల తాకగా, శుక్రవారం పసిడి స్వల్పంగా తగ్గి, రూ.40 వేలకు అటు ఇటుగా ధరలు ఊగిసలాడుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.39,820 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ముంబైలో రూ.39860 వద్ద ట్రేడవుతోంది. విజయవాడలో 39797 వద్ద ధర కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగా బంగారం ధరలు చూస్తే ఔన్సు పరిమాణం ధర రూ.1530 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే డాలర్ మారకానికి ప్రతిగా రూపాయి విలువ 71.60 వద్ద కొనసాగుతోంది. దీంతో బంగారం ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి. అలాగే అమెరికా-చైనా వాణిజ్యయుద్ధం భయాలతో బంగారం డిమాండ్ అమాంతం పెరిగింది. దీంతో న్యూయార్క్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1530-1550 డాలర్ల శ్రేణిలో ఊగిసలాడుతోంది.

పండగ సీజన్ సైతం బంగారం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొనగోలుదారులకు పసిడి, వెండి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ముఖ్యంగా వివాహ, ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేసేవారు ధరల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ బంగారం దుకాణాదారులు మాత్రం ఇకపై బంగారం ధర మరింత పెరుగుతుందే తప్ప తగ్గే చాన్స్ లేదని జోస్యం చెబుతున్నారు. దీంతో బంగారం కొనుగోలుదారులు సందిగ్ధంలో పడ్డారు. కొద్ది స్థాయిలో అయినా బంగారం ర్యాలీ తగ్గితే కొంతైనా బంగారం కొనవచ్చనే ఉద్దేశ్యంతో ఉన్నారు.
First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading