Gold Rate Today: బంగారం ధరలు తగ్గుతున్నాయి...నగలు కొనేందుకు ఇదే సరైన సమయమా ?

Gold Rate Today: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల వైపు కదులుతున్నప్పటికీ, అది దీర్ఘకాలికంగా మాత్రం కాదనే వార్తలు వస్తున్నాయి. మరోసారి ఆర్థికంగా కుదుపులు వచ్చినట్లయితే, మదుపుదారులు బంగారం వైపే పెట్టుబడులు పెట్టేందుకు కదులుతారని భావిస్తున్నాయి.

Krishna Adithya | news18-telugu
Updated: September 20, 2019, 3:35 PM IST
Gold Rate Today: బంగారం ధరలు తగ్గుతున్నాయి...నగలు కొనేందుకు ఇదే సరైన సమయమా ?
ప్రతీకాత్మక చిత్రం
Krishna Adithya | news18-telugu
Updated: September 20, 2019, 3:35 PM IST
Gold Rate Today: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవడం, బంగారంపై ఇన్వెస్ట్ మెంట్ చేసేందుకు మదుపుదారులు ఆసక్తి తగ్గించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకుల నుంచి వస్తున్న ఒత్తిడి దృష్ట్యా, అమెరికా ఫెడ్ రిజర్వ్ సైతం 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అలాగే దేశీయంగా జీఎస్టీ కౌన్సిల్ భేటీలో భాగంగా బంగారం, ఇతర విలువైన రాళ్లకు సైతం ఈ-వే బిల్లు సిస్టమ్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు పతనం కావడంతో బంగారం కొనుగోలు చేసేందుకు, పసిడి ప్రేమికులు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్ సైతం కలిసి రావడంతో జ్యువెలరీ షాపులు ఆఫర్లతో మార్కెట్లను ముంచెత్తేందుకు సిద్ధం అవుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో బంగారం కొనేందుకు ఇది అనువైన సందర్భమేనా అనే అంశంపై మాత్రం భిన్నాభిప్రాయాలు వెలువుతున్నాయి.

వాస్తవానికి పసిడి ధరలు పుంజుకునేందుకు, అంతర్జాతీయంగా నెలకొన్న వాణిజ్యయుద్ధం ప్రత్యక్షంగా కారణంగా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం వాణిజ్య యుద్ధం ఇంకా సమసిపోలేదనే మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ర్యాలీకి కాస్త బ్రేక్ పడినప్పటికీ, భవిష్యత్తుల్లో మాత్రం పసిడి రన్ కొనసాగే వీలుందనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్ల వైపు కదులుతున్నప్పటికీ, అది దీర్ఘకాలికంగా మాత్రం కాదనే వార్తలు వస్తున్నాయి. మరోసారి ఆర్థికంగా కుదుపులు వచ్చినట్లయితే, మదుపుదారులు బంగారం వైపే పెట్టుబడులు పెట్టేందుకు కదులుతారని భావిస్తున్నాయి. మరోవైపు న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1500 డాలర్ల వద్ద అటూ ఇటుగా ట్రేడవుతోంది. ఇదిలా ఉంటే బంగారం కొనుగోలు చేసేవారు పెట్టుబడులుగా పెట్టాలి అనుకుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సి ఉంటుందని, అయితే ఫిజికల్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ కొనుగోలు చేసేవారు తమ అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తే సరిపోతుందని బులియన్ నిపుణులు సూచిస్తున్నారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...