Gold Rate: తగ్గిన బంగారం ధర... పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్

బంగారం ధర 10గ్రాములకు గాను రూ.39213గా పలుకుతోంది. అదే సమయంలో హైదరాబాద్ లో బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ. 39870గా నమోదైంది. కాగా అంతర్జాతీయంగా బంగారం మార్కెట్ క్షీణించడంతోపాటు రూపాయి విలువ బలపడటం కూడా సానుకూలంశంగా మారింది.

news18-telugu
Updated: November 5, 2019, 5:49 PM IST
Gold Rate: తగ్గిన బంగారం ధర... పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని దిల్లీలో తులం (10 గ్రాములు) మేలిమి బంగారం ధర రూ.101 తగ్గింది. దీంతో బంగారం ధర 10గ్రాములకు గాను రూ.39213గా పలుకుతోంది. అదే సమయంలో హైదరాబాద్ లో బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ. 39870గా నమోదైంది. కాగా అంతర్జాతీయంగా బంగారం మార్కెట్ క్షీణించడంతోపాటు రూపాయి విలువ బలపడటం కూడా సానుకూలంశంగా మారింది. అలాగే న్యూయార్క్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1500 డాలర్లుగా ఉంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఫెస్టివల్ ముగింపునకు వచ్చేసింది. దసరా, దీపావళి లాంటి ఫెస్టివల్స్ పూర్తి అయినప్పటికీ వివాహాలు సీజన్ ఇంకా ఉండటంతో పసిడి ప్రేమికులు బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని బంగారం దుకాణా దారులు ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నారు.
First published: November 5, 2019, 5:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading