Today Gold Rate: తగ్గిన బంగారం ధర...పసిడి ప్రేమికులకు ఊరట

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,720 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల బంగారం తులం ధర కూడా 36,410 రూపాయలకు పలికింది.

news18-telugu
Updated: December 9, 2019, 10:26 PM IST
Today Gold Rate: తగ్గిన బంగారం ధర...పసిడి ప్రేమికులకు ఊరట
Gold Price (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. వెండి ధరలు కొద్దిగా పెరిగాయి. పది గ్రాముల బంగారం ధర 50 రూపాయల వరకూ తగ్గింది. సోమవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 39,720 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల బంగారం తులం ధర కూడా 36,410 రూపాయలకు పలికింది. ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక వెండి ధర కేజీకి 100 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,500 రూపాయలకు చేరింది. అమెరికా-చైనా మధ్య ట్రేడ్ వార్ తగ్గుతోంది. ఇరు దేశాలు ఒప్పందానికి వచ్చేట్లుగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈక్విటీ మార్కెట్లు లాభాల బాటలోకి రావడంతో, బంగారం డిమాండ్ తగ్గేలా కనిపిస్తోంది. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వు ఇకపై రేట్ల కోత ఉండదని సంకేతాలిచ్చింది. దీంతో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గుచూపడం తగ్గించేశారు.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>