Gold Rate Today : బంగారం ధరలు ప్రపంచ మార్కెట్ల దెబ్బకు స్థిరంగా కదులుతున్నాయి. వరుసగా పతనం అవుతున్న బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో బంగారం ధరలు ఈరోజు మార్పులు లేకుండా స్థిరంగా నిలిచాయి. శనివారం (12.12.2020) బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధర 45,900 రూపాయల వద్దే నిలిచింది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు ఎటువంటి మార్పులూ లేకుండా 50 వేలరూపాయల మార్క్ దగ్గరే నిలిచింది. దీంతో 50,070 రూపాయలుగా బంగారం ధరలు ఉన్నాయి. ఇక ప్రపంచ మార్కెట్లలో సైతం బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బంగారం ఔన్స్ ధర అమెరికా మార్కెట్లో 1840 డాలర్లు పలుకుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధర భారీగా దిగివస్తోంది. కరోనా వ్యాక్సిన్ వార్తలు, ఈక్విటీ మార్కెట్ల ఆకర్షణ నేపథ్యంలో బంగారం నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోంది.
ముఖ్యంగా కరోనా మహమ్మారి అంతానికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో పసిడి ధరలు అమాంతం దిగి వస్తున్నాయి. అటు లండన్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ సాధారణ ప్రజలకు ఇస్తున్న నేపథ్యంలో కరోనా తగ్గిందన్న వార్తలు స్టాక్ మార్కెట్లకు ఊపిరిని అందిస్తున్నాయి. దీంతో బంగారం ధరలు నేల చూపులు చూసింది. వెండి ధరలు కూడా ఇదే బాట పట్టాయి. నిజానికి కరోనా నేపథ్యంలో బంగారం ధరలు సుమారు 40 శాతం వరకూ పెరిగాయి. ఇఫ్పుడిప్పుడే మదుపరులు తమ డబ్బును బంగారం నుంచి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు. దీంతో బంగారం ధరలు దిగివస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Gold prices, Gold rate hyderabad