news18-telugu
Updated: November 10, 2020, 11:18 AM IST
ప్రతీకాత్మకచిత్రం
దీపావళి, ధంతేరస్ దగ్గరపడే కొద్ది బంగారం ధరలు అమాంతం పడిపోతున్నాయి. ముఖ్యంగా పసిడి ధరలు దాదాపు 5 శాతం మేర పడిపోయాయి. అయితే అటు అంతర్జాతీయ పరిణామాలు సైతం పసిడి పతనానికి కలిసి వస్తున్నాయని భావిస్తున్నారు. ముఖ్యంగా బంగారం ధరల తగ్గుదలకు అమెరికాలో బైడెన్ గెలుపుతో పాటు కరోనా కట్టడి కోసం కొత్త సర్కారు చర్యలు తీసుకుంటుందనే వార్తలతో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. కరోనా కట్టడికి ఫైజర్ కంపెనీ కోవిడ్ 19 వ్యాక్సిన్‌పై చేసిన ప్రకటనే ఇందుకు ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ 90 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని ఫైజర్ సంస్థ వెల్లడించింది. దీంతో బంగారం, వెండి ధరలు ఉన్నట్టుండి పతనమయ్యాయి. ఫైజర్ కంపెనీ.. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీతో కలిసి కోవిడ్ 19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది.
అటు ఎంసీఎక్స్ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర దాదాపు 5 శాతం మేరకు పతనమైంది. 10 గ్రాముల బంగారం ధర రూ.2,500 తగ్గుదలతో రూ.49,659కు చేరుకుంది. వెండి ధర ఏకంగా 6 శాతం దిగజారింది. వెండి ధర కేజీకి రూ.4 వేల తగ్గుదలతో రూ.61,384కు చేరింది. ఆగస్ట్ తరువాత నుంచి చూస్తే బంగారం ధర ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. కరోనా వ్యాక్సిన్ వార్తలు బంగారం ధరల పరుగుకు అడ్డుకట్ట వేశాయి. ఫైజర్ బయోఎన్‌టెక్ తెలిపిన వివరాల ప్రకారం తమ కోవిడ్ 19 వ్యాక్సిన్‌తో సైడ్ఎఫెక్ట్స్ ఉండవు. ఈ టీకాకు సంబంధించిన ఫేజ్ 3 కోవిడ్19 టీకా ట్రయల్ ఫలితాలు విజయవంతమయ్యాయని సంస్థ తెలిపింది.
హైదరాబాద్ లో మాత్రం నిన్నటితో పోల్చితే బంగారం ధరలు ఈరోజు కొద్దిగా పెరిగాయి. మంగళవారం బంగారం ధరలు పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 580 రూపాయలు పెరిగి 48,600 రూపాయలకు చేరుకుంది. అయితే 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 640 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 53,020 రూపాయలుగా నమోదు అయింది.
Published by:
Krishna Adithya
First published:
November 10, 2020, 11:18 AM IST