Gold Rate: ట్రంప్ ఓటమితో...మహిళలకు బ్యాడ్ న్యూస్...ఎలాగంటే...

బంగారం ధరలు గడిచిన రెండు నెలలుగా గరిష్ట స్థాయి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అయితే ధంతేరస్ దగ్గర పడుతుంటే మాత్రం పసిడి ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో అటు బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి.

news18-telugu
Updated: November 7, 2020, 5:34 PM IST
Gold Rate: ట్రంప్ ఓటమితో...మహిళలకు బ్యాడ్ న్యూస్...ఎలాగంటే...
డొనాల్డ్ ట్రంప్.. (ఫైల్)
  • Share this:
దీపావళి, ధంతేరస్ సమీపించే కొద్దీ బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో పసిడి ప్రేమికులకు షాక్ తగిలింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలలో పసిడి ధరలు ఊపందుకున్నాయి. వరుసగా మూడోరోజు భారీగా పెరిగాయి. పది గ్రాముల పసిడి ధర రూ.791 పెరిగి రూ.51,717 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జోరందుకోవడంతో దేశీయ మార్కెట్లపైనా దాని ప్రభావం పడిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యురిటీస్ వెల్లడించింది. ఇంతకు ముందు ట్రేడింగ్‌లో బంగారం ధర పది గ్రాములకు రూ. 50,926 వద్ద ముగిసింది. కాగా బంగారంతో పాటు వెండి కూడా ఇవాళ అంతే స్థాయిలో పుంజుకుంది. కిలో వెండి ధర రూ. 2,147 పెరిగి 64,578కి చేరింది. గత ట్రేడింగ్‌లో ఇది రూ. 62,431 వద్ద క్లోజ్ అయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,950 డాలర్లుగా ఉండగా, వెండి ధర ఔన్సుకు 25.44 వద్ద కొనసాగుతోంది.

ట్రంప్ ఓటమి, కరోనా సెకండ్ వేవ్ తో బంగారం వెలుగులు...

బంగారం ధరలు గడిచిన రెండు నెలలుగా గరిష్ట స్థాయి నుంచి తగ్గుతూ వస్తున్నాయి. అయితే ధంతేరస్ దగ్గర పడుతుంటే మాత్రం పసిడి ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో అటు బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. కరోనా వైరస్ ఫస్ట్ ఫేజ్ నుంచి కోలుకోకుండానే పలు దేశాల్లో ఇప్పుడు కరోనా రెండవ దశ ప్రతాపం చూపిస్తోంది. రోజుకు భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక యూరప్, అమెరికా దేశాల్లో కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. మొదటి సారి కంటే సెకండ్‌ వేవ్‌లో అత్యంత భయంకరంగా వైరస్‌ విజృంభిస్తోంది. అమెరికాలో రికార్డు స్థాయిలో ఒకే రోజు 90 వేల కేసులు నమోదు కాగా.... యూరప్‌ దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం, ఇటలీలలో కరోనా రోగులతో ఆస్పత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఫ్రాన్స్‌లో నెలరోజుల పాటు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలు చేస్తే, జర్మనీలో పాక్షికంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. దీంతో స్టాక్ మార్కెట్లు మరోసారి తిరోగమనం బాట పట్టడం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా బంగారం సేఫెస్ట్ ఇన్వెస్ట్ మెంట్ కావడంతో మదుపరులు మరోసారి పసిడి వైపు కదిలిస్తున్నారు. దీంతో బంగారం ధర పెరుగుతోంది. అలాగే అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్ ముందు వరుసలో నిలవడంతో కూడా పసిడి ధరల పెరుగుదులకు కారణం అవుతున్నాయి.
Published by: Krishna Adithya
First published: November 7, 2020, 5:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading