హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Rate: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్...దిగివచ్చిన ధరలు...నగల వ్యాపారుల్లో జోష్

Gold Rate: పసిడి ప్రేమికులకు గుడ్ న్యూస్...దిగివచ్చిన ధరలు...నగల వ్యాపారుల్లో జోష్

ఫ్రతీకాత్మకచిత్రం

ఫ్రతీకాత్మకచిత్రం

వరుసగా రెండు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు ...ఈ రోజు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం కాస్త తగ్గుదల కనపించింది. బంగారం ధరలు హైదరాబాద్ లో ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. శనివారం బంగారం ధరలు శుక్రవారం ప్రారంభ ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుదల కనబరిచాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు తగ్గి 47,100 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 110 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో మేలిమి బంగారం తులం 51,380 రూపాయలుగా నమోదు అయింది. మరోవైపు వెండి ధరలు కూడా స్వల్ప తగ్గుదల కనబరిచాయి. కిలో వెండి ధర 400 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 62వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగివచ్చాయి. కేజీ వెండి ధర 62,600 రూపాయల వద్ద నమోదు అయింది.

బంగారం కొనుగోళ్లకు దసరా జోష్...

దసరా, దీపావళి పండగల సీజన్‌ సందర్భంగా పసిడి ప్రేమికులతో ఆభరణాల మార్కెట్ మళ్లీ కిటకిటలాడుతోంది. ఫెస్టివల్ సందర్భంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కరోనా, లాక్‌డౌన్ల డల్ గా మారిన గోల్డ్ మార్కెట్ మళ్లీ పుంజుకుంది. పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ.49,000 నుంచి రూ.51,000 మధ్య స్థిరంగా ఉండడం కూడా ఇందు కు కలిసొస్తోంది. ఈ సంవత్సరం అమ్మకాల్లో 60 -65 శాతం ఈ పండగల సీజన్‌లోనే పూర్తవుతాయని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.పెళ్లిళ్ల సీజన్‌ కూ డా ప్రారంభమైతే అమ్మకాలు మరింత పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే వర్షాలు ఈ సారి సకాలంలో కురవడంతో పాటు, అన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదయ్యింది. ఫలితంగా ఈ సంవత్సరం ఆహార ధాన్యాలు, వాణిజ్య పంటలు దిగుబడి రికార్డు స్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకునే వీలుంది. ఫలితంగా బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

అయితే డిమాండ్‌ ఉన్నప్పటికీ అందుకు తగ్గట్టుగా ఆభరణాలను తయారు చేయలేకపోవటం పెద్ద సమస్యగా మారింది. కరోనా దెబ్బతో నగల తయారీ కార్మికులు వారి స్వస్థలాలకు వెళ్లిపోయారు. వారిలో ఇంకా చాలా మంది ఇంకా తిరిగి రాలేదు. నగల వ్యాపారులు కూడా డిమాండ్‌ ఇప్పట్లో కోలుకోదనే అంచనాతో వారిని మళ్లీ పనుల్లోకి తీసుకొచ్చేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఉన్నట్టుండి ఇప్పుడు డిమాండ్‌ పెరగడంతో కస్టమర్ల అభిరుచికి తగ్గట్టు నగలు అందించడం పెద్ద సమస్యగా మారింది. కార్మికులు పూర్తిగా పనుల్లోకి వస్తే తప్ప, ఈ సమస్య నుంచి బయట పడే అవకాశం లేదని భావిస్తున్నారు. ధంతేరస్, దీపావళి నాటికి ఈ సమస్య తీరే అవకాశం ఉందని భావిస్తున్నారు.

First published:

Tags: Gold, Gold price down, Gold rate hyderabad

ఉత్తమ కథలు