హోమ్ /వార్తలు /business /

Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భగభగ....6 సంవత్సరాల గరిష్టానికి చేరిన పసిడి..

Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లో బంగారం భగభగ....6 సంవత్సరాల గరిష్టానికి చేరిన పసిడి..

Gold Rate:  చైనా కరెన్సీ భారీ పతనంతో పాటు, అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది.

    Gold Rate: అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. బంగారం ధర ఏకంగా 6 సంవత్సరాల గరిష్ట స్థాయిని తాకింది. ముఖ్యంగా చైనా కరెన్సీ భారీ పతనంతో పాటు, అమెరికా, చైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలించారు. దీంతో బంగారం ధర ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు బంగారం ధర యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ లో చూసినట్లయితే ఔన్సు బంగారం ధర 1475 డాలర్లను తాకింది. అయితే స్పాట్ గోల్డ్ విలువ 1462 డాలర్లరు తాకగా, 2013లో చివరి సారిగా బంగారం ధర ఔన్సుకు 1474 డాలర్లకు ఎగిసింది.

    ఇదిలా ఉంటే చైనా భవిష్యత్తులో తన కరెన్సీ విలువను మరింత శక్తివంతంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుందని, అలాగే రానున్న రోజుల్లో అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం కారణంగా మరింత ముదిరితే బంగారంపై మరింత పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంక్ ఎకనామిస్ట్ జాన్ శర్మ తెలిపారు. మరోవైపు దేశీయ మార్కెట్లలో సైతం బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఎంఎంటీసీ జారీచేసిన 24 కేరట్ల స్వచ్ఛమైన బంగారం(99.9) 10 గ్రాములు కాయిన్ ధర ఏకంగా రూ.40583ను తాకింది. దీంతో బంగారం ధర అటు దేశీయ మార్కెట్లలో సైతం బంగారం గరిష్ట స్థాయిని తాకింది. ఇదిలా ఉంటే మరో విలువైన లోహం వెండిసైతం కేజీ ధర రూ.50,500ను తాకింది. ఇదిలా ఉంటే 22 కేరట్ ఆభరణాల బంగారం ధర ఒక గ్రాముకు రూ.3,487.00 వద్ద పలుకుతోంది.

    First published:

    ఉత్తమ కథలు