Gold Rate: లోకల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుదల...అంతర్జాతీయంగా పసిడి పరుగులు

దేశీయంగా సైతం బంగారం ధరలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బంగారం హైదరాబాద్ మార్కెట్లో 24 కేరట్ల మేలిమి బంగారం ధర (10గ్రాములు) రూ.39130గా పలుకుతోంది.

news18-telugu
Updated: December 15, 2019, 11:16 AM IST
Gold Rate: లోకల్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుదల...అంతర్జాతీయంగా పసిడి పరుగులు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
బంగారం ధరలు మరోసారి పెరుగదల బాట పట్టాయి. మొన్నటి వరకూ భారీగా పతనమైన బంగారం ధర ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి. ముఖ్యంగా న్యూయార్క్ బులియన్ మార్కెట్లో బంగారం ఔన్సు పరిమాణం ధర 1476 డాలర్లు పలుకుతోంది. గత వారం ఇదే ధర 1450-1460 డాలర్ల మధ్యలో పలికింది. ప్రస్తుతం ఒక్కసారిగా బంగారం ధర 1475 డాలర్ల ఎగువకు ఎగిసింది. ఇదిలా ఉంటే దేశీయంగా సైతం బంగారం ధరలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా బంగారం హైదరాబాద్ మార్కెట్లో 24 కేరట్ల మేలిమి బంగారం ధర (10గ్రాములు) రూ.39130గా పలుకుతోంది. అలాగే విజయవాడలో సైతం తులం బంగారం ధర రూ.39140గా పలికింది. అయితే అటు అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ, దేశీయంగా మాత్రం తగ్గుతున్నాయి. అటు వైజాగ్, నెల్లూరులో సైతం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి.

First published: December 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>