Gold Rate: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా అయితే తెలుసుకోవాల్సిన అంశాలివే...?

Gold Rate: భూమి, బంగారంపై పెట్టుబడి అనేది తరతరాలుగా మన దేశంలో వస్తున్న ఆచారం. ప్రతీ ఒక్కరూ వివాహ, పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారంలో పెట్టుబడి అంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి.

news18-telugu
Updated: October 18, 2019, 10:42 AM IST
Gold Rate: బంగారంలో పెట్టుబడి పెడుతున్నారా అయితే తెలుసుకోవాల్సిన అంశాలివే...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
Gold Rate |  బంగారం కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా ఈ మాసంలో బంగారం కొనుగోలు క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు అటు నగల వ్యాపారులకు సైతం ప్రయత్నం చేస్తుంటారు. నిజానికి భూమి, బంగారంపై పెట్టుబడి అనేది తరతరాలుగా మన దేశంలో వస్తున్న ఆచారం. ప్రతీ ఒక్కరూ వివాహ, పర్వదినాల్లో బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే బంగారంలో పెట్టుబడి అంటే ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ముఖ్యంగా సాధారణంగా మనకు తెలిసింది..దుకాణాల్లో బంగారం కొనుగోలు చేయడమే. అయితే ప్రస్తుతం బంగారాన్ని ముడి బంగారం, ఆభరణాల రూపంలోనే మాత్రమే కాకుండా గోల్డ్‌ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌), సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ (ఎస్‌జీబీ), గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు కూడా కొనుక్కోవచ్చు.

ఎంఎంటీసీ గోల్డ్ కాయిన్స్...

సాధారణంగా బంగారం కొనాలంటే, చాలామంది షాపులనే ఆశ్రయిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ లో సైతం ఫిజికల్ గోల్డ్ అమ్ముతున్నారు. అయితే మేలిమి బంగారం కొనుగోలుచేసేందకు ప్రభుత్వం జారీ చేసిన ఎంఎంటీసీ గోల్డ్ కాయిన్స్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇండియన్ గోల్డ్ కాయిన్ పేరిట విక్రయిస్తున్న ఈ బంగారు నాణేలు 24 క్యారట్ నాణ్యతతో పాటు 999 ఫిట్ నెస్ కలిగిఉంటాయి. అయితే ఈ కాయిన్స్ బీఐఎస్ స్టాండర్డ్ ప్రమాణాల ద్వారా తయారుచేస్తారు. ఈ కాయిన్స్ దేశంలో ఎంపిక చేసిన ఔట్ లెట్స్, బ్యాంకులు, పోస్టాఫీసుల్లో లభిస్తాయి. వీటిని 5, 10, 20 గ్రాముల్లో విక్రయిస్తారు. కొనుగోలుపై జీఎస్టీ చార్జీలు అదనం. అయితే ఈ కాయిన్లకు బయ్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంటుంది.

ఆభరణాల కొనుగోలు...
ఇక సాధారణ నగల దుకాణాల్లో అమ్మే ఆభరణాల్లో 22 క్యారట్ల నాణ్యత ఉన్న బంగారం వాడుతారు. అయితే ఆభరణాల కొనుగోలు ద్వారా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఆభరణాల కొనుగోలు సందర్భంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా తరుగు, మజూరి విషయంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే డిజైన్ మేకింగ్ చార్జీలు అదనంగా విధిస్తుంటారు. అయితే నగల షాపుల వారు కొన్నిసార్లు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయితే ఇందులో నెలవారీ వాయిదాల ప్రకారం గోల్డ్ స్కీమ్స్ ప్రకటిస్తుంటారు. దీని ద్వారా కూడా బంగారం ఆభరాణాలు కొనుగోలు చేయవచ్చు.

సావరిన్ గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్...
ఆర్బీఐ విడుదల చేసిన గోల్డ్ బాండ్స్ ద్వారా కూడా బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు. దీని ద్వారా క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు పొందవచ్చు. అలాగే ఈ బాండ్స్ పై 3 శాతం వడ్డీ లభిస్తుంది. అలాగే గోల్డ్ ఈటీఎఫ్ ద్వారా కూడా బంగారంపై పెట్టుబడులు పెట్టవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ లో ఉండే రిస్క్‌లు ఇందులో ఉంటాయి.
First published: October 18, 2019, 10:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading