Gold Rate Today: పసిడి ధరలకు రెక్కలు...రూ.40 వేల సమీపంలో తులం బంగారం

Gold Rate Today: 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.38,470 తాకినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అలాగే ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీ జారీ చేసే 999 క్వాలిటీ 10 గ్రాముల బంగారు కాయిన్ల ధర 42379 రూపాయలు తాకింది.

news18-telugu
Updated: August 13, 2019, 1:04 PM IST
Gold Rate Today: పసిడి ధరలకు రెక్కలు...రూ.40 వేల సమీపంలో తులం బంగారం
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Gold Rate Today | బంగారం ధరలు ప్రతీరోజు రికార్డు స్థాయిలో పెరుగుతూ కొత్త గరిష్టాలను తాకుతున్నాయి. దేశీయంగా ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం ధర 10 గ్రాములకు గానూ రూ.38,470 తాకినట్లు ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. అలాగే ప్రభుత్వ సంస్థ ఎంఎంటీసీ జారీ చేసే 999 క్వాలిటీ 10 గ్రాముల బంగారు కాయిన్ల ధర 42379 రూపాయలు తాకింది. ముఖ్యంగా ప్రపంచ మార్కెట్లలో అటు బంగారం ధరలు కంటిన్యూగా పెరుగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ఒక ఔన్సు ధర ఏకంగా 0.6 శాతం పెరిగి 1505 డాలర్లకు ఎగిసింది. ముఖ్యంగా యూఎస్ బాండ్లపై నెగిటివ్ యీల్డింగ్స్ కారణంగా బంగారంపై పెట్టుబడులు పెరిగినట్లు బులియన్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో బంగారం ధరలు ఈ ఏడాది దాదాపు 17 శాతం పెరిగాయి. అలాగే ఫెడ్ వడ్డీ రేట్లపై మదుపరులు కన్నేసి ఉంచారు.

మరోవైపు గోల్డ్ మ్యాన్ శాక్స్, సిటీ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్లించ్ సహా పలు సంస్థలు బంగారం పెట్టుబడులపై బుల్లిష్ గా ఉన్నాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు సెంట్రల్ బ్యాంకులు ఇప్పటికే 224.4 టన్నుల బంగారాన్ని రెండో క్వార్టర్ లో కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.

First published: August 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు