Gold Rate: భారీగా తగ్గిన బంగారం...పసిడి ప్రేమికులకు ఊరట...

Gold Rate: బులియన్ ట్రేడింగ్ లో బంగారం (24 కేరట్లు) 10 గ్రాముల ధర రూ.372లు తగ్గి రూ. 39278 పలికింది. రూపాయి కాస్త బలపడటంతో పాటు బంగారం డిమాండ్ తగ్గడంతో పసిడి ధర పతనమైంది.

news18-telugu
Updated: September 7, 2019, 5:13 PM IST
Gold Rate: భారీగా తగ్గిన బంగారం...పసిడి ప్రేమికులకు ఊరట...
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
  • Share this:
Gold Rate: పండగ సీజన్ ముందు రికార్డు స్థాయి ధర పలికిని బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టింది. శుక్రవారం బులియన్ ట్రేడింగ్ లో బంగారం (24 కేరట్లు) 10 గ్రాముల ధర రూ.372లు తగ్గి రూ. 39278 పలికింది. రూపాయి కాస్త బలపడటంతో పాటు బంగారం డిమాండ్ తగ్గడంతో పసిడి ధర పతనమైంది. అలాగే వెండిధర కేజీకి రూ.1200 తగ్గి 49187కు పతనమైంది. మరోవైపు అంతర్జాతీయంగా చూసినట్లయితే, న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1510 డాలర్లకు తగ్గుముఖం పట్టడం విశేషం. ఇదిలా ఉంటే ప్రస్తుతం వచ్చిన రిలీఫ్ కొంతకాలం ఉండే ఛాన్స్ ఉందని, కానీ భవిష్యత్తులో బంగారం ధరలు యథావిధిగా పెరిగే చాన్స్ ఉందని బులియన్ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతయ మాంద్యం బలపడే కొద్దీ బంగారంపై పెట్టుబడులు పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

First published: September 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>