హోమ్ /వార్తలు /బిజినెస్ /

Gold Price Drops: 4 వారాల ర్యాలీ తర్వాత తగ్గిన బంగారం ధర.. నగల కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

Gold Price Drops: 4 వారాల ర్యాలీ తర్వాత తగ్గిన బంగారం ధర.. నగల కొనుగోలుకు ఇదే మంచి సమయమా?

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Gold Price Today: నాలుగు వారాల పాటు స్థిరంగా పెరిగిన బంగారం ధరలు (Gold Prices) ఈ వారం రెండు శాతానికి పైగా తగ్గాయి. డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, యూఎస్ ఫెడ్ అధికారులు వడ్డీ రేట్లను పెంచడానికే మొగ్గు చూపిస్తుండటంతో బంగారం ధరల ర్యాలీకి బ్రేక్ పడింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Gold Price Drops: నాలుగు వారాల పాటు స్థిరంగా పెరిగిన బంగారం ధరలు (Gold Prices) ఈ వారం రెండు శాతానికి పైగా తగ్గాయి. డాలర్ ఇండెక్స్ పుంజుకోవడం, యూఎస్ ఫెడ్ అధికారులు వడ్డీ రేట్లను పెంచడానికే మొగ్గు చూపిస్తుండటంతో బంగారం ధరల ర్యాలీకి బ్రేక్ పడింది.  ఈ క్రమంలో ఇప్పుడు  మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో (MCX) 10 గ్రాముల బంగారం ధర రూ.51,505 వద్ద క్లోజ్ అయ్యింది. ఔన్సు (దాదాపు 28 గ్రాములు) స్పాట్ బంగారం ధర 1,747 డాలర్ల వద్ద క్లోజ్ అయ్యింది. మరి బంగారం కొనడానికి ఇదే మంచి సమయమా? లేక వెయిట్ చేయాలా? అనే ప్రశ్నలకు నిపుణులు ఏం సమాధానాలు ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.


కమోడిటీ మార్కెట్ నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధరకు 1,730 డాలర్ల వద్ద ఇమీడియట్ సపోర్ట్ ఉంది. మేజర్ సపోర్ట్ మాత్రం 1,670 డాలర్ల వద్ద ఉంది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌ (MCX)లో 10 గ్రాముల బంగారం ధరకి ఇమీడియట్ సపోర్ట్ దాదాపు రూ.51,000 వద్ద ఉంది. మేజర్ సపోర్ట్ ప్రస్తుతానికి రూ.48,750-రూ.48,800 మధ్య ఉంది. బలమైన డాలర్ బంగారం ధరపై ప్రభావం చూపించే అవకాశం ఉందని, ఫలితంగా ధర ఇమీడియట్ సపోర్ట్ దగ్గరగా రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఓవర్‌ఆల్‌గా చూస్తే బంగారం ధర పెరిగే సూచనలే కనిపిస్తున్నాయని అన్నారు.

Business Ideas: కేజీ మాంసం ధర రూ.1200.. కడక్‌నాథ్ కోళ్లతో రైతులు కోటీశ్వరులయ్యే ఛాన్స్

బంగారం ధర తగ్గడానికి కారణాలు

వరుసగా నాలుగు వారాల లాభాల తర్వాత బంగారం ధరలు నష్టపోయాయి. అమ్మకాల ఒత్తిడికి తలొగ్గి బంగారం ధరలు పతనమయ్యాయి. ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ప్రతి ఔన్సుకు 1800 డాలర్ల వద్ద నిలుస్తోంది. డాలర్ ఇండెక్స్‌లో పెరిగిన బలం వల్ల వరుస వారాలుగా పెరుగుతున్న బంగారం ధర (Gold Rate) ఇప్పుడు తగ్గింది. ఇటీవల డాలర్ ఇండెక్స్ 104.63 మార్కును తాకి దాదాపు 3 శాతం పతనమైంది. ఈ సడన్ కరెక్షన్ గోల్డ్ ప్రైస్ మూడు వారాల కనిష్ట స్థాయికి దిగొచ్చేలా చేసింది. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గే వరకు ఫెడ్ అధికారులు వడ్డీ రేట్లను పెంచాలనుకుంటున్నారు. ఇది కూడా బంగారం ధరల తగ్గుదలకు కారణమైంది. అంతేకాకుండా, నిరంతరం విపరీతంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి రేట్లను మరింత పెంచాల్సిన అవసరముందని ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. యూకేలోనూ ద్రవ్యోల్బణం పెరుగుతోంది.

బంగారం ధర ఔట్‌లుక్

బంగారం ధర ఔట్‌లుక్ పాజిటివ్‌గా ఉంటుందని.. షార్ట్ టర్మ్‌లో ఏ షార్ట్ పొజిషన్ తీసుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డాలర్‌లోని బలం కొంత కాలం పాటు గోల్డ్ ధరను ఒత్తిడిలో ఉంచుతుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ నిపుణులు అంచనా వేశారు. ఇమీడియట్ సపోర్ట్స్‌ దృష్టిలో ఉంచుకొని బంగారం కొనుగోలు చేయాలని సూచించారు. సమీప భవిష్యత్తులోని ప్రైస్ ఔట్‌లుక్ విషయానికొస్తే, పసిడి ధరలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కానీ 10 గ్రాములకి రూ.51,400 వద్ద ప్రారంభ మద్దతు, 10 గ్రాముల జోన్‌కు రూ.50,700 వద్ద కీలక మద్దతు లభించే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు. వచ్చే వారంలో జరిగే జాక్సన్ హోల్ సింపోజియం మీటింగ్‌ కూడా బంగారం ధరలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుందన్నారు.

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Business, Gold price, Gold rate

ఉత్తమ కథలు